Telugu Global
Cinema & Entertainment

గూఢచారిగా ప్రభాస్.. దాదాపు ఫిక్స్

సాహో సినిమా మేకింగ్ వీడియో రిలీజైన దగ్గర్నుండి సినిమా అప్ డేట్స్ చిన్నచిన్నగా బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా సినిమాలో ప్రభాస్ పాత్రపై పరోక్షంగా చిన్న క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సినిమాలో ప్రభాస్ వివిధ దేశాలు చుట్టేస్తుంటాడని చెబుతున్నారు. తనకు అప్పగించిన పని పూర్తిచేసేందుకు ప్రభాస్ ఇలా దేశాలన్నీ కవర్ చేస్తుంటాడని అంటున్నారు. మేకర్స్ స్టేట్ మెంట్ చూస్తుంటే.. ఈ సినిమాలో ప్రభాస్ గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం అర్థమౌతోంది. హాలీవుడ్ లో వచ్చిన జేమ్స్ బాండ్, […]

గూఢచారిగా ప్రభాస్.. దాదాపు ఫిక్స్
X

సాహో సినిమా మేకింగ్ వీడియో రిలీజైన దగ్గర్నుండి సినిమా అప్ డేట్స్ చిన్నచిన్నగా బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా సినిమాలో ప్రభాస్ పాత్రపై పరోక్షంగా చిన్న క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సినిమాలో ప్రభాస్ వివిధ దేశాలు చుట్టేస్తుంటాడని చెబుతున్నారు. తనకు అప్పగించిన పని పూర్తిచేసేందుకు ప్రభాస్ ఇలా దేశాలన్నీ కవర్ చేస్తుంటాడని అంటున్నారు.

మేకర్స్ స్టేట్ మెంట్ చూస్తుంటే.. ఈ సినిమాలో ప్రభాస్ గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం అర్థమౌతోంది. హాలీవుడ్ లో వచ్చిన జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో హీరో ఇలానే కనిపిస్తాడు. తనకు అప్పగించిన సీక్రెట్ మిషన్ పూర్తిచేసేందుకు ఏ దేశం కావాలంటే ఆ దేశం ఎగిరిపోతుంటాడు. పని పూర్తిచేస్తుంటాడు.

సరిగ్గా ఇదే ఛాయల్లో ప్రభాస్ పాత్ర కూడా ఉంటుందంటూ లీకులు మొదలయ్యాయి. పూర్తిస్థాయి జేమ్స్ బాండ్ తరహా సినిమా చేద్దామనే ఆలోచన పరిశ్రమలో చాలామంది హీరోలకు ఉంది. కానీ భారీ బడ్జెట్ కారణంగా అంతా వెనకడుగు వేశారు. ఎట్టకేలకు దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ గా, అతడి మిషన్ లో సహాయం చేసే పాత్రలో శ్రద్ధా కపూర్ కనిపించబోతోంది.

First Published:  27 Oct 2018 9:20 PM GMT
Next Story