Telugu Global
NEWS

జగన్‌పై దాడి.... అనుమానాస్పదంగా ఏసీపీ లంకా అర్జున్‌ తీరు....

జగన్‌పై హత్యాయత్నం తర్వాత చంద్రబాబుతో పాటు పోలీసు ఉన్నతాధికారుల తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఒక ప్రతిపక్ష నేతపై దాడిజరిగితే పూర్తిగా విచారణ జరపకుండానే అఘమేఘాల మీద డీజీపీ ఠాకూర్ మీడియా ముందుకొచ్చి దాడి చిన్నదేనని, దాడి చేసింది జగన్‌ అభిమానే అంటూ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. కానీ నిందితుడు శ్రీనివాసరావు కుటుంబం పూర్తిగా టీడీపీకి చెందినదిగా తేలింది. శ్రీనివాస్ రావు తండ్రి తాతారావు టీడీపీ తాజా మాజీ ఉప సర్పంచ్‌ అని నిర్ధారణ అయింది. […]

జగన్‌పై దాడి.... అనుమానాస్పదంగా ఏసీపీ లంకా అర్జున్‌ తీరు....
X

జగన్‌పై హత్యాయత్నం తర్వాత చంద్రబాబుతో పాటు పోలీసు ఉన్నతాధికారుల తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఒక ప్రతిపక్ష నేతపై దాడిజరిగితే పూర్తిగా విచారణ జరపకుండానే అఘమేఘాల మీద డీజీపీ ఠాకూర్ మీడియా ముందుకొచ్చి దాడి చిన్నదేనని, దాడి చేసింది జగన్‌ అభిమానే అంటూ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు.

కానీ నిందితుడు శ్రీనివాసరావు కుటుంబం పూర్తిగా టీడీపీకి చెందినదిగా తేలింది. శ్రీనివాస్ రావు తండ్రి తాతారావు టీడీపీ తాజా మాజీ ఉప సర్పంచ్‌ అని నిర్ధారణ అయింది. సొంతూరు పక్కనే కోటి రూపాయలకు నాలుగెకరాలు కొనేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించడంతో ఆ డబ్బు జగన్‌ను హత్య చేసినందుకు ప్రతిఫలంగా వచ్చేదిగా భావిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్‌రావు చొక్కా కూడా నలగకుండా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో విశాఖ నార్త్‌ జోన్ ఏసీపీ లంకా అర్జున్‌ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఘటన జరిగినప్పుడు విమానాశ్రయం నుంచి ఆ తర్వాత జరిగిన అన్ని పరిణామాల్లోనూ ఏసీపీ లంకా అర్జున్ అనుమానాస్పదంగానే వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీకి ఏజెంట్‌గా లంకా అర్జున్ పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. లంకా అర్జున్‌ కూడా దాడి చేసిన వ్యక్తి జగన్‌ అభిమానే అని నమ్మించేందుకు పదేపదే ప్రయత్నించడంతో వైసీపీ ఆరోపణలకు బలం చేకూరుతోంది. పైగా దాడి చేసిన శ్రీనివాసరావు అమాయకుడని ఏసీపీ లంకా అర్జున్ పదేపదే వ్యాఖ్యానిస్తూ నిందితుడి తరపున వకాల్తా పుచ్చుకోవడం పోలీసులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతిపక్ష నేతనే చంపేందుకు ప్రయత్నించిన శ్రీనివాసరావుకు పోలీసుల కస్టడీలో రాచమర్యాదలు సాగుతుండడం కూడా విమర్శలకు కారణమవుతోంది.

First Published:  27 Oct 2018 11:29 PM GMT
Next Story