Telugu Global
NEWS

వైఎస్‌పై అభిమానం.... మ‌హాకూట‌మికి ఇర‌కాటం

జగన్ పై జరిగిన హ‌త్యాయ‌త్నం… ఆతర్వాత చంద్రబాబు చేసిన వెటకారపు వ్యాఖ్యలతో తెలంగాణ పొత్తు రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. తెలంగాణాలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం విష‌యం తెలిసి… ఆయ‌న ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలుసుకుని… కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, దానం నాగేంద‌ర్‌తో పాటు చాలా మంది కాంగ్రెస్ నేత‌లు ఆసుప‌త్రికి వచ్చారు. జ‌గ‌న్‌ను ప‌రామ‌ర్శించారు. […]

వైఎస్‌పై అభిమానం.... మ‌హాకూట‌మికి ఇర‌కాటం
X

జగన్ పై జరిగిన హ‌త్యాయ‌త్నం… ఆతర్వాత చంద్రబాబు చేసిన వెటకారపు వ్యాఖ్యలతో తెలంగాణ పొత్తు రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

తెలంగాణాలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం విష‌యం తెలిసి… ఆయ‌న ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలుసుకుని… కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, దానం నాగేంద‌ర్‌తో పాటు చాలా మంది కాంగ్రెస్ నేత‌లు ఆసుప‌త్రికి వచ్చారు. జ‌గ‌న్‌ను ప‌రామ‌ర్శించారు.

తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డాన్ని తెలంగాణ తెలుగుదేశం నేత‌లు త‌ప్పుప‌డుతున్నారో లేదో తెలియ‌దు. కానీ ఏపీ టీడీపీ నేత‌లు మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. మ‌హాకూట‌మిలో త‌మ‌తో పొత్తు పెట్టుకుని జ‌గ‌న్‌ను ఎలా క‌లుస్తార‌ని కొంద‌రు ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే రాజ‌కీయం రాజ‌కీయ‌మే… అభిమానం అభిమానమే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో పాటు జ‌గ‌న్ అంటే త‌మ‌కు అభిమానం ఉంద‌ని… హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌పుడు వెళ్లి పరామ‌ర్శిస్తే త‌ప్పేంటి అనేది తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల వాద‌న‌.

ఇదిలా ఉంటే తెలంగాణ‌లోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇప్ప‌టికీ చాలా మంది ఇక్క‌డ రైతుల సంక్షేమం గురించి మాట్లాడాల్సి వ‌స్తే వైఎస్‌ గురించి మాట్లాడ‌తారు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతల ఓటర్లు చంద్రబాబుతో కాంగ్రెస్ కలిసి పోటీ చేయడాన్ని అంగీకరించడం లేద‌ని తెలుస్తోంది.

వైఎస్ ఆర్ కుమారుడు జగన్ పార్టీ తెలంగాణలో పోటీ చేయకున్నా ప్రతి నియోజక వర్గంలో 5-10 వేల మంది కరడు గట్టిన వైఎస్ అభిమానులున్నారు. ఇప్పుడా ఓటర్లకు కాంగ్రెస్ దూరమయ్యే అవకాశాలున్నాయి. రుణమాఫీ, వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంజనీరింగ్ చదివే విద్యార్థుకు ఫీజు రీఎంబర్స్ మెంటు, 108, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అభ్యర్థించిన ప్రతి ఒక్కరికి సహాయం అందించడం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామీణ ప్రజానీకంపై బలమైన ముద్ర వేశారు.

ఆయన ఆకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన కుమారుడిని కేసులు పెట్టి జైలుకు పంపింది. ఇలాంటి కుట్రపూరిత చర్యలతో వైఎస్ అభిమానులు కాంగ్రెస్ కు దూరమయ్యారు. ఫలితంగా 2014లో తెలంగాణలో ఆ పార్టీ పరాజయం పాలైంది.

ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకతతో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఈ వర్గం చంద్రబాబు ఫ్రస్టేషన్ రాజకీయాలతో మళ్లీ దూరంగా జరుగుతోంది. బాదితుడినే నిందితుడిగా చూపేలా చంద్రబాబు విద్వేష పూరిత వ్యాఖ్యలతో టిఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్టయింది. మొత్తానికి జ‌గ‌న్ వ్య‌వ‌హారం ఏపీ రాజకీయాల్లోనే కాదు… తెలంగాణ ఎన్నిక‌ల‌పై కూడా ప్ర‌భావం చూపే అవకాశాలు క‌న్పిస్తున్నాయి.

First Published:  26 Oct 2018 8:24 PM GMT
Next Story