Telugu Global
NEWS

పెద్దిరెడ్డి కూకట్‌పల్లికి షిఫ్ట్.... వెనుక పెద్ద కథేనట!

తెలంగాణ ఎన్నికల వేళ టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా, కూటమిలో ఇంకా అభ్యర్థి విషయం తేలలేదు. దాదాపు ఈ నియోజవకర్గం టీడీపీకే కేటాయింపు జరుగుతుందంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో అక్కడ పోటీ చేసేందుకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఎవరికి వారు పట్టుబడుతుండటంతో ఎవరినీ తేల్చుకోలేకపోతున్నాట. కూకట్ పల్లి లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ. గతంలో టీడీపీ గెలుపొందింది. 2014లో ఇక్కడ టీడీపీ తరుపున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఈ సారి కూడా […]

పెద్దిరెడ్డి కూకట్‌పల్లికి షిఫ్ట్.... వెనుక పెద్ద కథేనట!
X

తెలంగాణ ఎన్నికల వేళ టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా, కూటమిలో ఇంకా అభ్యర్థి విషయం తేలలేదు. దాదాపు ఈ నియోజవకర్గం టీడీపీకే కేటాయింపు జరుగుతుందంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో అక్కడ పోటీ చేసేందుకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఎవరికి వారు పట్టుబడుతుండటంతో ఎవరినీ తేల్చుకోలేకపోతున్నాట.

కూకట్ పల్లి లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ. గతంలో టీడీపీ గెలుపొందింది. 2014లో ఇక్కడ టీడీపీ తరుపున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఈ సారి కూడా తమకే టిక్కెట్ కేటాయించాలని టీడీపీ అడుగుతోందట. ఎందుకంటే ఖచ్చితంగా గెలిచే స్థానాలను వదులుకోకూడదని టీడీపీ కరాఖండిగా చెబుతుంది.

బీజేపీ నుంచి మాధవరం కాంతారావు పోటీ చేయనున్నట్లు తేలిపోయింది. ఇక కూటమి అభ్యర్థి ఎవరో తేలలేదు. దాదాపు టీడీపీకే కేటాయింపు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాత, కొత్త నేతలు టిక్కెట్ కోసం పట్టుబడుతున్నారు. టీడీపీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, ఆరెకపూడి ప్రసాద్, మందడి శ్రీనివాసరావు, మాధవరం రంగారావు, కృష్ణగౌడ్ తదితరులు టిక్కెట్ ఆశిస్తున్నారు. సీటు కేటాయింపు ప్రకటన దగ్గరకు రావడంతో ఎవరి స్థాయిలో వారు పైరవీలు జరుపుతున్నారు.తాజాగా లయన్స్ క్లబ్ ప్రతినిధి డాక్టర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ టీడీపీ తరుపున రేసులోకి వచ్చారు. అధిష్టానం మాత్రం అందరినీ పరిశీలిస్తున్నట్లు చెబుతుందంట. గెలిచేవారికే కేటాయిస్తామని, ఎవరి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలని కోరుతుందట.

ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ప్రచారంలోకి దిగిపోయారు. యూనియన్లు, నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు. ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానాలు పలుకుతున్నారు. నిజానికి పెద్దిరెడ్డి సొంత స్థానం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. అక్కడ టీఆర్ఎస్ నుంచి బలమైన ఈటల రాజేందర్ ఉన్నారు. ఈటలనే పెద్దిరెడ్డికి సర్ధిచెప్పి కూకట్ పల్లికి పంపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ లో పోటీచేయకుండా 5 కోట్ల వరకూ చేతులు మారాయనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదుకానీ ఆ ఇద్దరు నేతల సన్నిహితుల నుంచి మాత్రం పోటీలేకుండా తమ నేతలు కాంప్రమైజ్ అయ్యారని లీకులు ఇస్తున్నారు.

పెద్దిరెడ్డికి టీడీపీలో ఉన్న పరిచయాల దృష్ట్యా కూకట్ పల్లి టిక్కెట్టు ఆయనకే కేటాయించినట్లు చెబుతున్నారు. ఆఫీషియల్ ప్రకటించలేదని అంటున్నారట. దీంతో టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావహులు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు. చివరి క్షణంలో ఏదైనా జరగవచ్చని కార్యకర్తలకు సంకేతాలు పంపతున్నారు. కూకట్ పల్లి వ్యవహారం టీపీడీలో అసమ్మతి పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే కూటమికి మైనస్ అవుతుందనడంలో సందేహం లేదు.

First Published:  26 Oct 2018 7:38 PM GMT
Next Story