Telugu Global
Cinema & Entertainment

మరో సారి డ్యూయల్ రోల్ లో సమంతా

సమంతా ప్రస్తుతం తన భర్త నాగ చైతన్యతో కలిసి ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి “మజిలి” అనే టైటిల్ పెట్టారు మూవీ యూనిట్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి ఓకే చెప్పింది సమంతా. ఒక కొరియన్ సినిమా ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సమంత చాలా విభిన్నమైన పాత్రలో కనిపిస్తుందట. ఈ సినిమాలో 70 ఏళ్ల భామగా, […]

మరో సారి డ్యూయల్ రోల్ లో సమంతా
X

సమంతా ప్రస్తుతం తన భర్త నాగ చైతన్యతో కలిసి ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి “మజిలి” అనే టైటిల్ పెట్టారు మూవీ యూనిట్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి ఓకే చెప్పింది సమంతా. ఒక కొరియన్ సినిమా ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సమంత చాలా విభిన్నమైన పాత్రలో కనిపిస్తుందట.

ఈ సినిమాలో 70 ఏళ్ల భామగా, 20 ఏళ్ల యువతిగా కనిపించబోతుందట అక్కినేని వారి కోడలు. అలాగే ఈ సినిమాలో నాగశౌర్య ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడట. కానీ సినిమా మొత్తం సమంతా పాత్ర చుట్టే తిరుగుతుందట. “యు టర్న్” వంటి థ్రిల్లర్ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల లిస్టు లోకి ఎంటర్ అయిన సమంతా, ఈ సినిమాతో ఆ లిస్టు ని కంటిన్యూ చేద్దాం అని డిసైడ్ అయ్యింది అంట. సురేష్ ప్రొడక్షన్ పై సురేష్ బాబు అలాగే గురు ఫిలింస్ పై సునీత తాటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం.

First Published:  26 Oct 2018 11:27 PM GMT
Next Story