Telugu Global
Cinema & Entertainment

కొరటాల శివ చెప్పిన కథ చిరంజీవికి నచ్చలేదా ?

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “సై రా” షూటింగ్ లో బిజీ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇప్పటికే చిరంజీవి కోసం ఒక సోషల్ మెసేజ్ తో కూడుకున్న కథ రాసుకున్నాడు కొరటాల శివ. కానీ కొరటాల రాసుకున్న కొన్ని సన్నివేశాలు ఇంకా బెటర్ గా ఉంటే బాగుంటుందని చిరు చెప్పడంతో వాటిలో మార్పులు చేస్తున్నాడట కొరటాల శివ. ఈ నేపథ్యంలో కథలోనే […]

కొరటాల శివ చెప్పిన కథ చిరంజీవికి నచ్చలేదా ?
X

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “సై రా” షూటింగ్ లో బిజీ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇప్పటికే చిరంజీవి కోసం ఒక సోషల్ మెసేజ్ తో కూడుకున్న కథ రాసుకున్నాడు కొరటాల శివ. కానీ కొరటాల రాసుకున్న కొన్ని సన్నివేశాలు ఇంకా బెటర్ గా ఉంటే బాగుంటుందని చిరు చెప్పడంతో వాటిలో మార్పులు చేస్తున్నాడట కొరటాల శివ. ఈ నేపథ్యంలో కథలోనే అక్కడక్కడా ఛేంజెస్ చేయాల్సి వస్తుందట.

మొత్తం స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి నవంబర్, డిసెంబర్ కూడా ఆ పనుల్లో బిజీగా ఉండనున్నాడు కొరటాల. ఇదివరకు కూడా కథ సరిగ్గా నచ్చక చిరంజీవి కొరటాల శివ చేత కథ మార్పించుకున్నాడు. దాంతో సినిమా ముహూర్తం వాయిదా వేసి జనవరిలో ప్రారంభిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఎందుకంటే డిసెంబర్ నాటికి “సై రా” సినిమాలో చిరంజీవి భాగం పూర్తీ చేయాలి అని దర్శకుడు సురేందర్ రెడ్డి అలాగే నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నారు.

First Published:  26 Oct 2018 11:17 PM GMT
Next Story