Telugu Global
Cinema & Entertainment

సూపర్ స్టార్ కి అమెరికా లో అవమానం జరిగిందా ?

“మహర్షి” సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు అమెరికా లో షూటింగ్ చేస్తున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా అమెరికా లోనే షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న కొన్ని తెలుగు సంఘాలు మహేష్ బాబుని చీఫ్ గెస్ట్ గా పిలిచి అమెరికా లో ఈవెంట్ చేద్దాం అని భావించారు. మహేష్ కు అమెరికాలో ఎనలేని క్రేజ్ ఉంది. దాంతో టికెట్ రేటు […]

సూపర్ స్టార్ కి అమెరికా లో అవమానం జరిగిందా ?
X

“మహర్షి” సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు అమెరికా లో షూటింగ్ చేస్తున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా అమెరికా లోనే షూటింగ్ జరుపుకుంటుంది. ఇక

ఈ విషయం తెలుసుకున్న కొన్ని తెలుగు సంఘాలు మహేష్ బాబుని చీఫ్ గెస్ట్ గా పిలిచి అమెరికా లో ఈవెంట్ చేద్దాం అని భావించారు.
మహేష్ కు అమెరికాలో ఎనలేని క్రేజ్ ఉంది. దాంతో టికెట్ రేటు ఏకంగా 2 వేల డాలర్లుగా పెట్టారు ఆ సంస్థ వాళ్ళు. అయితే భారీ మొత్తం కావడంతో ఆ కార్యక్రమానికి పెద్దగా స్పందన రాలేదు. దాంతో షాక్ అయిన నిర్వాహకులు ఆ రేటు ని సగానికి తగ్గించారట. అయినప్పటికీ టికెట్లు అలాగే ఉండిపోవడంతో మరింతగా తగ్గించారు. అప్పుడు మాత్రమే కొన్ని బుకింగ్స్ జరిగాయట .

అయితే అది కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఏకంగా మహేష్ బాబు ప్రోగ్రాం నే క్యాన్సిల్ చేసారట. ఎందుకంటే తక్కువ మొత్తంతో కార్యక్రమం నిర్వహిస్తే నష్టాలు వచ్చే సూచన ఉండటంతో అది క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా మహేష్ బాబుకి అవమానమే అని అక్కడ ఉన్న కొంత మంది జనాలు భావిస్తున్నారు.

First Published:  26 Oct 2018 12:44 AM GMT
Next Story