Telugu Global
Cinema & Entertainment

టైటిల్ ఫిక్స్.. అదే పేరు

రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ దాదాపు ఫిక్స్ అయింది. ఈ మూవీకి సంబంధించి దాదాపు 2 నెలలుగా చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ, ఫైనల్ గా వినయ విధేయ రామ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. నిజానికి ఈ టైటిల్ కూడా బాగానే చక్కర్లు కొట్టింది. కానీ దీన్నే ఫైనల్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. వినయ విధేయ రామ.. బోయపాటి మైండ్ నుంచి పుట్టిన టైటిల్ ఇది. ఆ టైటిల్ […]

టైటిల్ ఫిక్స్.. అదే పేరు
X

రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ దాదాపు ఫిక్స్ అయింది. ఈ మూవీకి సంబంధించి దాదాపు 2 నెలలుగా చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ, ఫైనల్ గా వినయ విధేయ రామ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. నిజానికి ఈ టైటిల్ కూడా బాగానే చక్కర్లు కొట్టింది. కానీ దీన్నే ఫైనల్ చేస్తారని ఎవరూ ఊహించలేదు.

వినయ విధేయ రామ.. బోయపాటి మైండ్ నుంచి పుట్టిన టైటిల్ ఇది. ఆ టైటిల్ అయితేనే సినిమాకు సూట్ అవుతుందని మెగాస్టార్ చిరంజీవి నుంచి చరణ్ వరకు అందర్నీ ఒప్పించాడట బోయపాటి. అలా తన మాట నెగ్గించుకున్నాడు. అలా వినయ విధేయ రామ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ పేరును సీక్రెట్ గా ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. అయితే టైటిల్ పై దాదాపు స్పష్టత వచ్చినప్పటికీ.. ఫస్ట్ లుక్ పై మాత్రం ఇంకా అనుమానాలు తొలిగిపోలేదు. ఆగస్ట్ 22, చిరంజీవి బర్త్ డే రోజున విడుదల అవుతుందనుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటివరకు రానేలాదు. రీసెంట్ గా దసరాకు కూడా వస్తుందని మెగా ఫ్యాన్స్ భావించారు. కనీసం దీపావళికైనా వినయ విధేయ రామ ఫస్ట్ లుక్ వస్తుందేమో చూడాలి.

First Published:  25 Oct 2018 9:59 PM GMT
Next Story