Telugu Global
Cinema & Entertainment

శైలజారెడ్డి అల్లుడు క్లోజింగ్ షేర్

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన శైలజారెడ్డి అల్లుడు తన థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లో ఓ యావరేజ్ చిత్రంగా నిలిచింది. మారుతి-చైతూ ఫ్రెష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా, నిర్మాతలకు మాత్రం కాస్త లాభాలు తెచ్చిపెట్టింది. చైతన్య మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరలకు అమ్మడంతో ఏపీ, నైజాంలో ఇది ఈజీగానే బ్రేక్-ఈవెన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 16 […]

శైలజారెడ్డి అల్లుడు క్లోజింగ్ షేర్
X

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన శైలజారెడ్డి అల్లుడు తన థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లో ఓ యావరేజ్ చిత్రంగా నిలిచింది. మారుతి-చైతూ ఫ్రెష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా, నిర్మాతలకు మాత్రం కాస్త లాభాలు తెచ్చిపెట్టింది.

చైతన్య మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరలకు అమ్మడంతో ఏపీ, నైజాంలో ఇది ఈజీగానే బ్రేక్-ఈవెన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 16 కోట్ల రూపాయలకు అమ్మగా.. వరల్డ్ వైడ్ ఈ సినిమా 24 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ ఇలా ఉంది.

నైజాం – రూ. 6.79 కోట్లు
సీడెడ్ – రూ. 3.11 కోట్లు
ఉత్తరాంధ్ర -రూ. 2.78 కోట్లు
ఈస్ట్ – రూ. 1.60 కోట్లు
వెస్ట్ – రూ. 1.02 కోట్లు
గుంటూరు – రూ. 1.63 కోట్లు
కృష్ణా – రూ. 1.08 కోట్లు
నెల్లూరు – రూ. 0.64 కోట్లు

First Published:  25 Oct 2018 9:37 PM GMT
Next Story