Telugu Global
NEWS

శివాజీ.... బ్రహ్మంగారి అవతారమా?

ఆపరేషన్ గరుడా. ఇది ఆంధ్రప్రదేశ్‌పై జరుగుతున్న కుట్ర ఆపరేషన్ అని నటుడు శివాజీ పదేపదే చెబుతున్నారు. అతడు చెప్పింది నిజమే. ఇది ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్‌పై జరుగుతున్న కుట్రే. కానీ ఆ కుట్రను చేస్తున్నది ఎవరన్నదే ముఖ్యం.  రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో పోతులూరి వీరబ్రహ్మేందస్వామి తరహాలో  శివాజీ చెప్పడం… అవి జరగడం చూస్తూనే ఉన్నాం.  నెల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రతిపక్షనాయకుడిపై దాడి జరుగుతుంది అని శివాజీ చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు కూడా జరుగుతాయని […]

శివాజీ.... బ్రహ్మంగారి అవతారమా?
X

ఆపరేషన్ గరుడా. ఇది ఆంధ్రప్రదేశ్‌పై జరుగుతున్న కుట్ర ఆపరేషన్ అని నటుడు శివాజీ పదేపదే చెబుతున్నారు. అతడు చెప్పింది నిజమే. ఇది ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్‌పై జరుగుతున్న కుట్రే. కానీ ఆ కుట్రను చేస్తున్నది ఎవరన్నదే ముఖ్యం. రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో పోతులూరి వీరబ్రహ్మేందస్వామి తరహాలో శివాజీ చెప్పడం… అవి జరగడం చూస్తూనే ఉన్నాం. నెల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రతిపక్షనాయకుడిపై దాడి జరుగుతుంది అని శివాజీ చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు కూడా జరుగుతాయని సెలవిచ్చారు. ఇదంతా ఏపీని రాజకీయంగా ఆక్రమించేందుకు బీజేపీ అధినాయకత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ గరుడలో భాగమేనని శివాజీ చెప్పారు.

ఒక నటుడు ఇంత నేరుగా వచ్చి ప్రతిపక్షనాయకుడిపై దాడి జరుగుతుందని… రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయని ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పినా అతడి వైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. ఫేస్‌బుక్‌లోనో, వాట్సాప్‌లోనే పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించే పోలీసులు, ప్రభుత్వం…. ఇలా ఒక నటుడు ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయని తన వద్ద సమాచారం ఉందని చెబుతుంటే మాత్రం అతడిని కనీసం విచారణ చేయకపోవడం బట్టి ఆపరేషన్‌ గరుడ పురాణాన్ని రచించింది ఎవరో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఆయన ఏలుబడిలోని రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరుగుతుందని, అల్లర్లు జరుగుతాయని ఒక వ్యక్తి చెబితే దాన్ని అడ్డుకునేందుకు ఖచ్చితంగా అతడిని విచారించాలి. విదేశాల్లో ఎవరైనా ఇలా ప్రెస్‌మీట్ పెట్టి మరీ అల్లర్లు జరుగుతాయని, నేతలపై దాడులు జరుగుతాయని చెప్పి ఉంటే… ఆ ప్రెస్‌మీట్ ముగిసే లోపే పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని తీసుకెళ్లి విచారించేవారు. తలకిందుల వేలాడదీసైనా సరే… అల్లర్ల సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు అన్నది కక్కించేవారు.

ఎవరైనా చెప్పారా… లేక కల వచ్చిందా… లేక పోతులూరి వీరబ్రహేంద్రస్వామి తరహాలో ప్రత్యేక మహిమలు ఏమైనా శివాజీకి ఉన్నాయా అన్నది సదరు పొలిటికల్ కమెడియన్‌ నోటి నుంచే చెప్పించేవారు. విదేశాల్లోనే కాదు మన దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలోనైనా అల్లర్లు జరగబోతున్నాయని ఒక వ్యక్తి చెబితే పోలీసులు తప్పని సరిగా తీసుకెళ్లి విచారించేవారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో అదీ చంద్రబాబు ఏలుబడిలో మాత్రమే మీడియా సమావేశాలు పెట్టి మరీ కుట్ర కథలు చెబుతున్నా ప్రభుత్వం, పోలీసులు కావాలని కళ్లప్పగించి చూడడం సాధ్యమవుతోంది.

కానీ నటుడు శివాజీ పదేపదే కుట్ర కథలు చెబుతున్నా… వాటిని అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎందుకు అతడిని విచారించడం లేదు. చంద్రబాబుకు ఆ ఆలోచన వచ్చి ఉండకపోచ్చు. కానీ డీజీపీ ఏం చేస్తున్నారు. తమ రాష్ట్రంలో అల్లర్లు జరగబోతున్నాయని ఒక నటుడు చెప్పినా సరే కనీసం ఎందుకు దానిపై విచారణ జరపడం లేదు.

అన్నింటికి మించి… ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే… కుట్ర కథలు చెబుతున్న శివాజీని విచారించడం మానేసి… ముఖ్యమంత్రి నుంచి టీడీపీ మంత్రుల వరకు అంతా ఆపరేషన్‌ గరుడ ప్రకారం జరుగుతోంది అంటూ శివాజీ స్టోరికి వంతపాడడం. చంద్రబాబు అనుకూల మీడియా శివాజీని భవిష్యవాణి చెప్పే భగవంతుడిలా చూపించడం బట్టి అసలు కుట్ర ఢిల్లీలో జరిగిందా లేక అమరావతిలో జరిగిందా అన్నది ఇట్టే అర్థమవుతుంది.

చివరకు జగన్‌పై దాడి జరిగిన తర్వాత కూడా చంద్రబాబు శివాజీ చెప్పినట్టే జరుగుతుందని చెప్పారే గానీ.. ఇప్పటికైనా ఆ శివాజీకి సమాచారం ఎక్కడిది? కుట్ర వెనుక ఎవరున్నారన్నది చేధిస్తామని మాత్రం చెప్పడం లేదు. పైగా నటుడు శివాజీ తొలి నుంచి చంద్రబాబు మనిషిలాగే వ్యవహరిస్తున్నారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తే మద్దతు తెలపని శివాజీ… చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత యూటర్న్ తీసుకుని దీక్ష చేస్తే మాత్రం వెళ్లి వేదికపై ప్రసంగాలు చేసి వచ్చారు. పైగా శివాజీకి టీడీపీ మీడియా మోతాదుకు మించి ప్రచారం ఇస్తోంది.

ఈ మొత్తం పరిణామాలు బట్టి చూస్తుంటే ఆపరేషన్‌ గరుడ నడుస్తున్నది నిజమే. కానీ శివాజీ చెబుతున్నట్టు ఆ గరుడ పురాణం వెనుక కేంద్ర ప్రభుత్వమో, ప్రతిపక్షమో లేదన్నది స్పష్టం. ఇదంతా అమరావతి వేదికగా జరుగుతున్న తంతే. కేంద్రం మీద నెపం నెట్టి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలను అడ్డుతొలగించుకునే వ్యవహారం సాగుతున్నట్టుగానే ఉంది.

ప్రతిపక్షనేతపై దాడి జరుగుతుందని శివాజీ చెప్పిన తర్వాత కూడా ప్రతిపక్ష వైసీపీ దాన్ని నిలదీయలేదు. తమ నేతపై ఎవరు దాడి చేయబోతున్నారో తేల్చాలని గట్టిగా డిమాండ్ చేయలేకపోయింది. అంతా పుకార్లులే అని సర్దుకుపోయింది. కానీ కత్తి మెడ వరకు వచ్చి అదృష్టం బాగుండి భుజం వైపు మళ్లింది.

ఇప్పటికైనా శివాజీని అదుపులోకి తీసుకుని ఆపరేషన్ గరుడ సంగతులు ఆయనకు ఎవరు చెప్పారో తేల్చాలని కోర్టులనైనా వైసీపీ ఆశ్రయించాలి. చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టులు ఆదేశాలు ఇస్తాయా అన్నది ఇప్పుడు చాలా మందిలో ఉన్న అనుమానం. కానీ ఈ దేశంలో అంతకు మించి మరో మార్గం లేదు కదా!

First Published:  25 Oct 2018 10:45 PM GMT
Next Story