Telugu Global
NEWS

రమణా రెడ్డి సతీమణి మృతి

ప్రముఖ హాస్యనటుడు రమణా రెడ్డి సతీమణి సుదర్శనమ్మ (93) గురువారం చెన్నైలో మరణించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. తెలుగు వాళ్ళందరికీ చిర పరిచితుడైన రమణా రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా. ఆయన పూర్తి పేరు తిక్కవరపు వెంకట రమణా రెడ్డి. ఆయనది భూస్వామ్య కుటుంబం. ఆయన గొప్ప నటుడే కాక మంచి మిమిక్రీ కళాకారుడు కూడా. కొన్ని సినిమాలు కూడా తీశారు. సినీ పరిశ్రమకు వచ్చి సరైన అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న […]

రమణా రెడ్డి సతీమణి మృతి
X

ప్రముఖ హాస్యనటుడు రమణా రెడ్డి సతీమణి సుదర్శనమ్మ (93) గురువారం చెన్నైలో మరణించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు.

తెలుగు వాళ్ళందరికీ చిర పరిచితుడైన రమణా రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా. ఆయన పూర్తి పేరు తిక్కవరపు వెంకట రమణా రెడ్డి. ఆయనది భూస్వామ్య కుటుంబం. ఆయన గొప్ప నటుడే కాక మంచి మిమిక్రీ కళాకారుడు కూడా. కొన్ని సినిమాలు కూడా తీశారు.

సినీ పరిశ్రమకు వచ్చి సరైన అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కొందరికి ఆయన గుప్త దానాలు చేశారు కూడా. రమణా రెడ్డి 1974లోనే అకాల మరణం చెందారు.

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సుదర్శనమ్మ భౌతిక కాయానికి శనివారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయి.

First Published:  26 Oct 2018 12:25 AM GMT
Next Story