Telugu Global
National

మన్నెం నాగేశ్వరరావు విధాన నిర్ణయాలు తీసుకోవద్దు- సుప్రీం కోర్టు

సీబీఐలో ఏర్పడిన సంక్షోభంతో సుప్రీం కోర్టు విచారణ జరిపింది. డైరెక్టర్‌ అలోక్‌ వర్మను బలవంతంగా సెలవుపై పంపడంతో పాటు అవినీతి ఆరోపణలు ఉన్న మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు… కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని సీవీసీని ఆదేశించింది. విచారణకు మూడు వారాల గడువు కావాలని సీవీసీ కోరగా సుప్రీం కోర్టు […]

మన్నెం నాగేశ్వరరావు విధాన నిర్ణయాలు తీసుకోవద్దు- సుప్రీం కోర్టు
X

సీబీఐలో ఏర్పడిన సంక్షోభంతో సుప్రీం కోర్టు విచారణ జరిపింది. డైరెక్టర్‌ అలోక్‌ వర్మను బలవంతంగా సెలవుపై పంపడంతో పాటు అవినీతి ఆరోపణలు ఉన్న మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు… కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.

అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని సీవీసీని ఆదేశించింది. విచారణకు మూడు వారాల గడువు కావాలని సీవీసీ కోరగా సుప్రీం కోర్టు తిరస్కరించింది.

అంతేకాదు అలోక్‌ వర్మపై విచారణను సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షిస్తారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు నవంబర్‌ 12కు వాయిదా వేసింది.

First Published:  26 Oct 2018 1:25 AM GMT
Next Story