Telugu Global
NEWS

ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెబుతారా?

క‌రీంన‌గ‌ర్‌లో ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు ప‌క్క పార్టీల వైపు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టికెట్ రాక‌పోతే జంప్ చేయ‌డ‌మే మేల‌ని వీరు డిసైడ్ అయ్యార‌ని టాక్ విన్పిస్తోంది. చొప్పదండి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని దాదాపు నిర్ణయించున్నారు. ఉమ కాంగ్రెస్ వైపు, శోభ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 […]

ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెబుతారా?
X

క‌రీంన‌గ‌ర్‌లో ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు ప‌క్క పార్టీల వైపు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టికెట్ రాక‌పోతే జంప్ చేయ‌డ‌మే మేల‌ని వీరు డిసైడ్ అయ్యార‌ని టాక్ విన్పిస్తోంది.

చొప్పదండి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని దాదాపు నిర్ణయించున్నారు. ఉమ కాంగ్రెస్ వైపు, శోభ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో 12 సీట్ల‌కు టీఆర్ఎస్ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించారు. కానీ చొప్ప‌దండి టికెట్ మాత్రం అనౌన్స్ చేయ‌లేదు. బొడిగె శోభ‌కు టికెట్ ఇస్తారా? లేదా? అనే స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. ఆమె ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో సైలెంట్‌గా ప్ర‌చారం చేస్తున్నారు. గులాబీ టికెట్‌పై మాత్రం ఆమెకు ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. పార్టీ హైక‌మాండ్ నుంచి ఆమెకు హామీ కూడా రాలేదట‌.

టీఆర్ఎస్ ఎస్సీ సెల్ చైర్మన్ సుంకె రవిశంకర్ కు టికెట్ ఖ‌రారైన‌ట్లు ప్ర‌చారం న‌డుస్తోంది. టికెట్ రాకపోతే బొడిగె శోభ ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. బీజేపీ టికెట్‌పై ఆమె పోటీ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆపార్టీ నేత‌ల‌తో మంత‌నాలు సాగించిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు వేములవాడ టికెట్ కోసం జ‌డ్పీ ఛైర్మ‌న్ తుల ఉమ తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ర‌మేష్‌బాబుకే మ‌ళ్లీ టికెట్ ద‌క్కింది. దీంతో ఉమ‌వ‌ర్గం ఇక్క‌డ నిర‌స‌న‌ల‌కు దిగింది, పెద్ద ఎత్తున స‌మావేశాలు నిర్వ‌హిస్తోంది. ఉమ‌కు టికెట్ ఇవ్వాల‌ని దాదాపు నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.

టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్న తుల ఉమ ఇప్పుడు ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టిపెట్టిన‌ట్లు ప్ర‌చారం న‌డుస్తోంది. టికెట్ ఇస్తే కాంగ్రెస్‌లోకి వ‌స్తాన‌ని ఆ పార్టీ నేత‌ల‌కు వ‌ర్త‌మానం పంపిన‌ట్లు స‌మాచారం. వారం రోజుల్లో ఆమె పార్టీ మార‌డంపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది.

First Published:  25 Oct 2018 8:52 PM GMT
Next Story