Telugu Global
NEWS

పరిటాల సునీత ఒక శూర్పణఖ.... అందుకే అలా....

ఆంధ్రప్రదేశ్‌లో ఆడవాళ్లను నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఒక రౌడీలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంతో పరిటాల సునీత…. చంద్రబాబును మించిపోయిందన్నారు రోజా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణమాఫి చేయలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మహిళ పరిటాల సునీత అని రోజా విమర్శించారు. తాను, పుష్పా శ్రీవాణి అడిగిన ప్రశ్నకు రుణమాఫీ చేయలేదని…. రుణమాఫీ చేసే అవకాశం కూడా లేదని అసెంబ్లీలో […]

పరిటాల సునీత ఒక శూర్పణఖ.... అందుకే అలా....
X

ఆంధ్రప్రదేశ్‌లో ఆడవాళ్లను నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఒక రౌడీలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంతో పరిటాల సునీత…. చంద్రబాబును మించిపోయిందన్నారు రోజా.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణమాఫి చేయలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మహిళ పరిటాల సునీత అని రోజా విమర్శించారు. తాను, పుష్పా శ్రీవాణి అడిగిన ప్రశ్నకు రుణమాఫీ చేయలేదని…. రుణమాఫీ చేసే అవకాశం కూడా లేదని అసెంబ్లీలో సమాధానం చెప్పిన పరిటాల సునీత ఇప్పుడు మాత్రం డ్వాక్రా మహిళలను ఉద్దరించింది తామేనని చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. పసుపు కుంకుమ అంటూ కథలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.

వైఎస్‌ గురించి మాట్లాడే అర్హత పరిటాల సునీతకు ఎక్కడుందని రోజా ప్రశ్నించారు. ఆడపిల్లలను సర్వనాశనం చేస్తున్న చంద్రబాబును రావణాసురుడు అనక దేవుడు అంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబును దేవుడు అనేందుకు పరిటాల సునీత లాంటి శూర్పణఖకు నోరొస్తుందేమో గానీ మరెవరికీ రాదన్నారు రోజా. పరిటాల సునీత చేస్తున్న అరాచకాలు ఏంటో ఒకసారి అనంతపురం జిల్లాకు వెళ్లి చూస్తే అర్థమవుతుందన్నారు.

ఆడవాళ్ల అక్రమ రవాణాలో ఏపీని తొలిస్థానానికి తీసుకొచ్చిన చంద్రబాబును చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. దేశం మొత్తం మీద ఒక్క ఏపీలో 26 శాతం మంది ఆడవాళ్లు వ్యభిచార కూపంలోకి తరలించబడుతున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలన్నారు.

వ్యవస్థలను సర్వనాశనం చేయడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరన్నారు. తిరుమల నుంచి సీబీఐ వరకు అన్ని వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారన్నారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకునే ఏపార్టీ కూడా బాగుపడదన్నారు.

First Published:  25 Oct 2018 1:59 AM GMT
Next Story