Telugu Global
Cinema & Entertainment

కళ్యాణ్ రామ్ నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన గత నాలుగు సినిమాలు హారిక హాసిని క్రియేషన్స్ వారికే చేస్తూ వచ్చాడు. ఇటివలే రిలీజ్ అయిన “అరవింద సమేత” ని కూడా వాళ్ళ బ్యానర్ లోనే చేసి హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదిలా ఉంటే ఇప్పటికే మైత్రి మూవీస్ కు, డివివి దానయ్య కు త్రివిక్రమ్ చెరో సినిమా చేయాల్సి ఉంది. ఆ మేరకు ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నారు.మరి ఆ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు సినిమా […]

కళ్యాణ్ రామ్ నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా
X

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన గత నాలుగు సినిమాలు హారిక హాసిని క్రియేషన్స్ వారికే చేస్తూ వచ్చాడు. ఇటివలే రిలీజ్ అయిన “అరవింద సమేత” ని కూడా వాళ్ళ బ్యానర్ లోనే చేసి హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదిలా ఉంటే ఇప్పటికే మైత్రి మూవీస్ కు, డివివి దానయ్య కు త్రివిక్రమ్ చెరో సినిమా చేయాల్సి ఉంది. ఆ మేరకు ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నారు.మరి ఆ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు సినిమా చేస్తాడో చూడాలి. ఇలాంటి నేపథ్యంలో కొద్దీ నెలల క్రితం అయన మరో బ్యానర్ దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ కొన్ని నెలల క్రితం కాస్త పెద్ద మొత్తంలోనే అంటే కోట్లలోనే అడ్వాన్స్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ అడ్వాన్స్ ఎన్టీఆర్ తో లేదా కళ్యాణ్ రామ్ తో అనేకాదు, త్రివిక్రమ్ ఎవరితోనైనా ఓ ప్రాజెక్టును ఆ బ్యానర్ లో చేయడానికి గాను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇంత మంది నిర్మాతల నుంచి డబ్బులు తీసుకున్న త్రివిక్రమ్ ఏ నిర్మాతతో తన తదుపరి సినిమాని తెరకేక్కిస్తాడో చూడాలి అని అందరూ ఎదురుచూస్తున్నారు.

First Published:  25 Oct 2018 10:48 AM GMT
Next Story