Telugu Global
NEWS

జగన్ పై దాడి.... డీజీపీ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు

వైఎస్ జగన్‌పై దాడి పట్ల ఏపీ డీజీపీ ఠాకూర్‌ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఘటనపై మాట్లాడిన డీజీపీ… దాడి చేసిన వ్యక్తి జగన్‌ అభిమానే అని తెలుస్తోందని చెప్పారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేసి ఉండవచ్చని తెలుస్తోందన్నారు. జగన్ ఇప్పుడు సేఫ్‌గా ఉన్నారన్నారు. నిందితుడి దగ్గర 10 పేజీల లేఖ ఉందన్నారు. అయితే ఆ లేఖలో ఉన్న అంశాలను మాత్రం డీజీపీ వెల్లడించలేదు. ఎయిర్‌పోర్టులో దాడి జరిగినందున అక్కడ భద్రత తమ పరిధిలోకి […]

జగన్ పై దాడి.... డీజీపీ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు
X

వైఎస్ జగన్‌పై దాడి పట్ల ఏపీ డీజీపీ ఠాకూర్‌ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఘటనపై మాట్లాడిన డీజీపీ… దాడి చేసిన వ్యక్తి జగన్‌ అభిమానే అని తెలుస్తోందని చెప్పారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేసి ఉండవచ్చని తెలుస్తోందన్నారు.

జగన్ ఇప్పుడు సేఫ్‌గా ఉన్నారన్నారు. నిందితుడి దగ్గర 10 పేజీల లేఖ ఉందన్నారు. అయితే ఆ లేఖలో ఉన్న అంశాలను మాత్రం డీజీపీ వెల్లడించలేదు. ఎయిర్‌పోర్టులో దాడి జరిగినందున అక్కడ భద్రత తమ పరిధిలోకి రాదన్నారు. సీఐఎస్‌ఎఫ్‌దే అక్కడి బాధ్యత అని డీజీపీ చెప్పారు.

కత్తి లోపలికి ఎలా వెళ్లిందన్నది ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులను అడుగుతామన్నారు. అన్నింటికి మించి డీజీపీ ఠాకూర్‌ ప్రెస్‌మీట్‌లో కొందరు జర్నలిస్టులు పనిగట్టుకుని దీని వెనుక జనసేన హస్తముందా అని ప్రశ్నించారు. దాడి చేసిన వ్యక్తి జనసేన అభిమాని అట కదా అని పదేపదే ప్రశ్నించారు.

డీజీపీ మాత్రం దాన్ని ఖండించారు. జనసేనకు, ఘటనకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. అయితే వ్యవహారాన్ని వైసీపీ, జనసేన మధ్య వివాదంగా మార్చేందుకే వ్యూహత్మకంగా కొత్త ప్రచారం మొదలుపెట్టినట్టు అనుమానిస్తున్నారు.

First Published:  25 Oct 2018 4:38 AM GMT
Next Story