Telugu Global
Cinema & Entertainment

సాహో సినిమాతో తమన్ కు ఏంటి సంబంధం?

సాహో సినిమాకు శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సంగీత త్రయం మ్యూజిక్ అందిస్తున్న సినిమా ఇది. మరి ఇలాంటి సినిమాతో తమన్ కు ఏంటి సంబంధం. లాజికల్ గా ఆలోచిస్తే ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సాహోతో తమన్ కు కనెక్షన్ ఉంది. ఈరోజు రిలీజైన సాహో మేకింగ్ వీడియోస్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది ఇతడే అవును.. చాప్టర్-1 పేరిట విడుదలైన మేకింగ్ వీడియోకు తమన్ […]

సాహో సినిమాతో తమన్ కు ఏంటి సంబంధం?
X

సాహో సినిమాకు శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సంగీత త్రయం మ్యూజిక్ అందిస్తున్న సినిమా ఇది. మరి ఇలాంటి సినిమాతో తమన్ కు ఏంటి సంబంధం. లాజికల్ గా ఆలోచిస్తే ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సాహోతో తమన్ కు కనెక్షన్ ఉంది. ఈరోజు రిలీజైన సాహో మేకింగ్ వీడియోస్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది ఇతడే

అవును.. చాప్టర్-1 పేరిట విడుదలైన మేకింగ్ వీడియోకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. కేవలం ఈ ఒక్క వీడియోకే కాదు, షేడ్స్ ఆఫ్ సాహో పేరిట రిలీజ్ కాబోయే అన్ని వీడియోలకు బీజీఎం తమనే ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు తమన్ తో భారీ డీల్ కుదుర్చుకున్నారు.

తనకు సంబంధం లేకపోయినా ఇలా మిగతా సినిమాలకు సంగీతం అందించడం తమన్ కు కొత్తేంకాదు. గతంలో సైరా విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆఖరి నిమిషంలో రెహ్మాన్ తప్పుకోవడంతో, సైరా ఫస్ట్ లుక్ టీజర్ కు తమన్ బీజీఎం అందించాడు. ఇప్పుడు శంకర్-ఎహసాన్-లాయ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో.. షేడ్స్ ఆఫ్ సాహోకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈరోజు రిలీజైన ఈ మేకింగ్ వీడియోలో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

First Published:  23 Oct 2018 10:04 PM GMT
Next Story