Telugu Global
Cinema & Entertainment

ప్ర‌దీప్ పెళ్లిచూపుల‌పై నిర‌స‌న‌లు !

మాటీవీ బిగ్‌బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మం కాంట్రావ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. నెట్టింట్లో వాద‌న‌లు, ట్రోలింగ్‌ల‌కు కార‌ణ‌మైంది. ఆర్మీలు, వాటి వెనుక స్టోరీల‌తో సోష‌ల్ మీడియా నిండిపోయింది. ఇప్పుడు అదే టైమ్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న రియాల్టీ షో ”పెళ్లి చూపులు”పై కూడా అంతే చ‌ర్చ న‌డుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి సుమ యాంక‌ర్. మ‌రో యాంక‌ర్ ప్ర‌దీప్ పెళ్లి ఆడబోయే యువ‌తి కోసం ఈ రియాల్టీ షో. త‌మిళంలో కూడా గ‌త ఏడాది హీరో ఆర్యను పెట్టి ఈ షో […]

ప్ర‌దీప్ పెళ్లిచూపుల‌పై నిర‌స‌న‌లు !
X

మాటీవీ బిగ్‌బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మం కాంట్రావ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. నెట్టింట్లో వాద‌న‌లు, ట్రోలింగ్‌ల‌కు కార‌ణ‌మైంది. ఆర్మీలు, వాటి వెనుక స్టోరీల‌తో సోష‌ల్ మీడియా నిండిపోయింది. ఇప్పుడు అదే టైమ్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న రియాల్టీ షో ”పెళ్లి చూపులు”పై కూడా అంతే చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ కార్య‌క్ర‌మానికి సుమ యాంక‌ర్. మ‌రో యాంక‌ర్ ప్ర‌దీప్ పెళ్లి ఆడబోయే యువ‌తి కోసం ఈ రియాల్టీ షో. త‌మిళంలో కూడా గ‌త ఏడాది హీరో ఆర్యను పెట్టి ఈ షో చేశారు. కానీ అక్క‌డ అంతో ఇంతో ఆడింది. కాంట్రావ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. వారం వారం వింత గేమ్‌లు పెట్టి…. పార్టిసిపెంట్స్ ను ఎలిమినేట్ చేస్తూ పోవ‌డం ఈ కార్య‌క్ర‌మం ఉద్దేశం. చివ‌ర‌కు ఇద్ద‌రో ముగ్గురో మిగులుతారు. వారిలో ఒక‌రిని ప్ర‌దీప్‌ను పెళ్లి చేసుకుబోయే యువ‌తిగా సెలెక్ట్ చేస్తారు.

అయితే ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మాన్ని వామ‌ప‌క్ష మ‌హిళా సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్రదీప్ పెళ్లి చూపుల కార్య‌క్ర‌మం నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. తిరుప‌తిలో సీఐటీయూ శ్రామిక మ‌హిళా క‌మిటీ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హిస్తున్నాయి. తిరుప‌తి నుంచి ప్రారంభ‌మైన ఈ నిర‌స‌న‌లు….త్వ‌ర‌లోనే రాష్ట్ర‌మంత‌టా పాకే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

First Published:  23 Oct 2018 7:37 PM GMT
Next Story