Telugu Global
National

ఇన్ని అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్న వ్యక్తికి ఈ పదవా?

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావు నియామకం దుమారం రేపుతోంది. అనేక అవినీతి ఆరోపణలు, అనేక కేసులు ఉన్న నాగేశ్వర రావును సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటి వరకు డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌ వర్మను బలవంతంగా సెలవుపై పంపి నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్న నాగేశ్వరరావును ఎలా ఆ పదవిలో […]

ఇన్ని అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్న వ్యక్తికి ఈ పదవా?
X

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావు నియామకం దుమారం రేపుతోంది. అనేక అవినీతి ఆరోపణలు, అనేక కేసులు ఉన్న నాగేశ్వర రావును సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి.

ఇప్పటి వరకు డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌ వర్మను బలవంతంగా సెలవుపై పంపి నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్న నాగేశ్వరరావును ఎలా ఆ పదవిలో నియమిస్తారని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్‌ కూడా నాగేశ్వరరావు నియమాకాన్ని తప్పుపట్టింది.

సీబీఐ డైరెక్టర్‌ను ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలిజియం నియమిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమెయిలీ గుర్తు చేశారు. తొలగింపు కూడా కొలిజియం ద్వారానే జరగాల్సి ఉంటుందన్నారు. కానీ అలోక్‌ వర్మను సెలవుపై పంపి… నాగేశ్వరరావును ఏకపక్షంగా కేంద్రం ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు.

నాగేశ్వరరావు నియామకంపై కొలిజియంను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. నాగేశ్వర రావుపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడం ద్వారా…. మోడీ తన కోసం పనిచేసే వారిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నా పట్టించుకోకుండా పదవులు ఇస్తారన్నది స్పష్టమవుతోందని వీరప్పమెయిలీ విమర్శించారు. మోడీ చర్యలు సీబీఐని నాశనం చేస్తున్నాయన్నారు.

First Published:  24 Oct 2018 5:47 AM GMT
Next Story