Telugu Global
NEWS

మహాకూట‌మిలో కొలిక్కిరాని సీట్లు ఇవే !

మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు తుది ద‌శ‌కు చేరింది. సీట్లపై ఉత్కంఠ‌తో కూడిన నాట‌కీయ ప‌రిణామాలు కొన‌సాగుతున్నాయి. 20 నుంచి 30 సీట్ల విష‌యంలో పీటముడి కొన‌సాగుతోంది. దాదాపు ఒకే సీటును కాంగ్రెస్‌, సీపీఐ, టీజేఎస్ కోరుతున్నాయి. దీంతో సీట్ల విష‌యంలో పంచాయ‌తీ జ‌రుగుతోంది. ఇవాళో రేపో ఈ సీట్ల విషయంలో క్లారిటీ వ‌స్తుంద‌ని కూట‌మి నేత‌లు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల‌, బెల్లంప‌ల్లిపై సీపీఐ ప‌ట్టుబ‌డుతోంది. అయితే టీజేఎస్ కూడా మంచిర్యాల సీటు ఇవ్వాల‌ని అడుగుతోంది. […]

మహాకూట‌మిలో కొలిక్కిరాని సీట్లు ఇవే !
X

మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు తుది ద‌శ‌కు చేరింది. సీట్లపై ఉత్కంఠ‌తో కూడిన నాట‌కీయ ప‌రిణామాలు కొన‌సాగుతున్నాయి. 20 నుంచి 30 సీట్ల విష‌యంలో పీటముడి కొన‌సాగుతోంది. దాదాపు ఒకే సీటును కాంగ్రెస్‌, సీపీఐ, టీజేఎస్ కోరుతున్నాయి. దీంతో సీట్ల విష‌యంలో పంచాయ‌తీ జ‌రుగుతోంది. ఇవాళో రేపో ఈ సీట్ల విషయంలో క్లారిటీ వ‌స్తుంద‌ని కూట‌మి నేత‌లు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల‌, బెల్లంప‌ల్లిపై సీపీఐ ప‌ట్టుబ‌డుతోంది. అయితే టీజేఎస్ కూడా మంచిర్యాల సీటు ఇవ్వాల‌ని అడుగుతోంది. వీలైతే ముథోల్ సీటు అయినా ఇవ్వాలని కోరుతోంది. ఇక ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో హుస్నాబాద్ సీటు విష‌యంలో పేచీ న‌డుస్తోంది. ఇక్క‌డి నుంచి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్‌రెడ్డి పోటీకి రెడీ అవుతుంటే…. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ‌వెంక‌ట‌రెడ్డి సీటు త‌మ‌దేన‌ని ప్ర‌చారం చేస్తున్నారు. క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ సీటును టీజేఎస్ కోరుతోంది. అయితే ఈ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా లేదు.

వ‌రంగ‌ల్ జిల్లాలో ఈస్ట్ లేదా వెస్ట్ ఇవ్వాల‌ని టీజేఎస్ కోరుతోంది. అయితే ప‌ర‌కాల సిట్టింగ్ స్థానంను టీడీపీ కోరుతోంది. ఇక్క‌డ పోటీ చేసేందుకు కొండా సురేఖ రెడీ అయ్యారు. దీంతో ఇక్క‌డ సీట్ల విష‌యంలో పంచాయ‌తీ ఏర్ప‌డింది. అలాగే హైద‌రాబాద్ అంబ‌ర్‌పేట‌తో పాటు ఒక స్థానం ఇవ్వాల‌ని టీజేఎస్ కోరుతోంది. అంబ‌ర్‌పేట ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇంకో స్థానం ఇచ్చేది లేద‌ని క్లారిటీ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం న‌డుస్తోంది.

మహ‌బూబ్‌న‌గ‌ర్ సీటు టీజేఎస్ కోరుతుంటే… దేవ‌ర‌క‌ద్ర‌, మ‌క్త‌ల్ రెండు సీట్లు ఇవ్వాల‌ని టీడీపీ అడుగుతోంది. అయితే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, దేవ‌ర‌క‌ద్ర సీట్ల‌ను టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సూత్ర‌ప్రాయంగా అంగీకారం తెలిపిన‌ట్లు తెలుస్తోంది.
ఖ‌మ్మంతో పాటు స‌త్తుప‌ల్లి సీటును టీడీపీ కోరుతోంది.

కొత్త‌గూడెం, వైరా తో పాటు ఇంకో సీటు ఇవ్వాల‌ని సీపీఐ ప‌ట్టుబ‌డుతోంది. అయితే ఇక్క‌డ సీపీఐకి రెండుసీట్లు ఇస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌తిపాద‌న పెట్టింది. న‌ల్గొండ జిల్లా మునుగోడు విష‌యంలో ఇవే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక్క‌డ కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పోటీలో దిగుతాన‌ని అంటున్నారు. దీంతో ఈ సీటు సీపీఐకి ఇస్తారా? లేదా? అనేది ఇంకా తేల‌లేదు.

నిజామాబాద్‌లో ఒకటి రెండు సీట్లు టీడీపీ కోరుతుంటే…ఒక సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు మూడు రోజుల్లో మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

First Published:  23 Oct 2018 11:57 PM GMT
Next Story