Telugu Global
Cinema & Entertainment

అర్జున్ మంచోడే " స్టార్ హీరోయిన్

“మీటూ” ప్రభావం ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరినీ కబలిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమా హీరోలని. అయితే ఇప్పటి వరకు కేవలం చిన్న హీరోల వరకే పరిమితం అయిన మీటూ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోలకి కూడా పాకింది. యాక్షన్ కింగ్ అర్జున్ తనని శారీరకంగా, మానసికంగా వేధించాలని చుశాడు అంటూ కన్నడ స్టార్ హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన వ్యాఖ్యలు అటు కన్నడ ఇండస్ట్రీ లో ఇటు తమిళ ఇండస్ట్రీ లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే […]

అర్జున్ మంచోడే  స్టార్ హీరోయిన్
X

“మీటూ” ప్రభావం ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరినీ కబలిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమా హీరోలని. అయితే ఇప్పటి వరకు కేవలం చిన్న హీరోల వరకే పరిమితం అయిన మీటూ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోలకి కూడా పాకింది. యాక్షన్ కింగ్ అర్జున్ తనని శారీరకంగా, మానసికంగా వేధించాలని చుశాడు అంటూ కన్నడ స్టార్ హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన వ్యాఖ్యలు అటు కన్నడ ఇండస్ట్రీ లో ఇటు తమిళ ఇండస్ట్రీ లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఈ ఇష్యూ లో అర్జున్ కి సపోర్ట్ చేస్తూ కొంత మంది అర్జున్ ని తిడుతూ కొంత మంది వస్తున్నారు.

ఇప్పుడు ఖుష్భూ వంతు వచ్చింది. అర్జున్ కి క్లిన్ చీట్ ఇచ్చింది. “గత 35ఏళ్లుగా అర్జున్ నాకు తెలుసు. తనతో చాలా సినిమాలు చేశాను. ఏ ఒక్కరోజు నాతొ తప్పుగా ప్రవర్తించలేదు.పైగా వందలమంది మధ్యలోకి నేను వెళ్లిన ప్రతి సందర్భంలోను తాను నన్ను రక్షించాడు. అటువంటి వ్యక్తిపై ఇటువంటి విమర్శలు రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అర్జున్ ని హీరోలా చూసే తన కూతుళ్లపై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయి. ఓ వ్యక్తిపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించాలి. తన నిజాయతీ నిరూపించుకోవడానికి ఓ అవకాశం ఇవ్వాలి. ఎవరూ ఈ విషయంలో తొందరపడొద్దు” అంటూ తన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది ఖుష్బూ. మరి ఈ ఇష్యూ పై అర్జున్ మీడియా ముందుకు వచ్చి ఎలా స్పందిస్తాడో చూడాలి.

First Published:  24 Oct 2018 12:50 AM GMT
Next Story