Telugu Global
Cinema & Entertainment

బాయ్ ఫ్రెండ్ కోసం కెరీర్ నాశనం చేసుకుంటున్న శ్రుతి హసన్

స్టార్ హీరోయిన్ అయిన శ్రుతి హసన్ “కాటమారాయుడు” సినిమా తరువాత ఏ ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే గతకొంత కాలంగా శ్రుతి హసన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన మైఖేల్ తో సహజీవనం చేస్తోంది. అయితే ఈ ఇద్దరూ జంటగా యావత్ ప్రపంచం చుట్టి వస్తున్నారు. కానీ అతను నీ లవరా అని అడిగితే మాత్రం ఫ్రెండ్ మాత్రమే అని తెలివిగా సమాధానం చెబుతోంది కమల్ హాసన్ గారాల పట్టి. దాదాపు ఏడాది కాలంగా సినిమాలను […]

బాయ్ ఫ్రెండ్ కోసం కెరీర్ నాశనం చేసుకుంటున్న శ్రుతి హసన్
X

స్టార్ హీరోయిన్ అయిన శ్రుతి హసన్ “కాటమారాయుడు” సినిమా తరువాత ఏ ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే గతకొంత కాలంగా శ్రుతి హసన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన మైఖేల్ తో సహజీవనం చేస్తోంది. అయితే ఈ ఇద్దరూ జంటగా యావత్ ప్రపంచం చుట్టి వస్తున్నారు. కానీ అతను నీ లవరా అని అడిగితే మాత్రం ఫ్రెండ్ మాత్రమే అని తెలివిగా సమాధానం చెబుతోంది కమల్ హాసన్ గారాల పట్టి.

దాదాపు ఏడాది కాలంగా సినిమాలను పక్కన పెట్టి మైఖేల్ తోనే గడుపుతోంది. మైకేల్ తో గడుపుతున్న సమయంలో అసలు టైం తెలియడం లేదట ఈ భామకు అంతగా నవ్విస్తున్నాడట , ప్రపంచాన్ని మరిచిపోయేలా చేస్తున్నాడట ఇతను. అసలు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు దాన్ని మరింతగా స్ట్రాంగ్ గా మలచుకోవాల్సింది పోయి మైఖేల్ వెంట పడుతూ కెరీర్ ని డేంజర్ జోన్ లో పడేసుకుంటుంది అని ఫిల్మ్ నగర్ జనాలు అంటున్నారు.

ప్రస్తుతం శ్రుతి హసన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు, కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం శ్రుతి హసన్ డేట్స్ కోసం వైట్ చేస్తున్నారు. కానీ శ్రుతి హసన్ మాత్రం మైఖేల్ కోర్సలే తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. మరి తన కూతురు కెరీర్ విషయం లో నైనా కమల్ హాసన్ ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాడో లేదో చూడాలి.

First Published:  24 Oct 2018 1:44 AM GMT
Next Story