Telugu Global
NEWS

విజయోత్సవ ర్యాలీలు.... టీడీపీ దివాళాకోరుతనానికి పరాకాష్ట!

చంద్రబాబు నాయుడుకు కావాల్సింది ప్రచారం మాత్రమే. సందర్భం అంటూ ఏమీ అక్కర్లేదు. దాన్ని క్రియేట్ చేసుకోగలడు. ఒకవేళ ఏ సందర్భం లేకపోతే జనాల విషాదాన్ని కూడా పండుగగా సెలబ్రేట్ చేసుకోగలడు చంద్రబాబు నాయుడు. అందుకే బాబును ఈవెంట్ మేనేజర్ అంటూ ఉంటారంతా. ఈ ఈవెంట్ మేనేజ్ మెంట్ లక్షణాలు చంద్రబాబు నాయుడులో కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడివి పతాక స్థాయికి చేరాయి. అందుకు నిదర్శనమే తిత్లీ తుఫాన్ ను జయించేశామంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు విజయోత్సవ ర్యాలీలు […]

విజయోత్సవ ర్యాలీలు.... టీడీపీ దివాళాకోరుతనానికి పరాకాష్ట!
X

చంద్రబాబు నాయుడుకు కావాల్సింది ప్రచారం మాత్రమే. సందర్భం అంటూ ఏమీ అక్కర్లేదు. దాన్ని క్రియేట్ చేసుకోగలడు. ఒకవేళ ఏ సందర్భం లేకపోతే జనాల విషాదాన్ని కూడా పండుగగా సెలబ్రేట్ చేసుకోగలడు చంద్రబాబు నాయుడు. అందుకే బాబును ఈవెంట్ మేనేజర్ అంటూ ఉంటారంతా.

ఈ ఈవెంట్ మేనేజ్ మెంట్ లక్షణాలు చంద్రబాబు నాయుడులో కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడివి పతాక స్థాయికి చేరాయి. అందుకు నిదర్శనమే తిత్లీ తుఫాన్ ను జయించేశామంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు విజయోత్సవ ర్యాలీలు తీయడం.

ఒకవైపు బాధితులకు ఇంకా పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందలేదు. తిత్లీ శ్రీకాకుళం జిల్లాను సర్వనాశనం చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తుఫాన్ దెబ్బకు అక్కడి జనాల జీవితాలు పదేళ్ళు వెనక్కు వెళ్లిపోయాయి. పంట నష్టం తీవ్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వం ఏదో నామమాత్రంగా కూడా ఇంకా సాయం అందించలేదు. ఇప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏ మాత్రం మెరుగుపడలేదు. అనేక గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించలేదు, తాగు నీరు కూడా అందడం లేదు.

అయితే తెలుగుదేశం వర్గాలు మాత్రం విజయోత్సవ యాత్రలు మొదలుపెట్టాయి.

అయినా చంద్రబాబు నాయుడుకు ఇది అలవాటే. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా రెండో రోజే తుఫాన్ ను జయించేశా అన్నాడు. అయితే ఇప్పటికీ హుదూద్ బాధితుల పరిస్థితి అలానే ఉంది. ఇక తిత్లీ సందర్భంగా జనాల్లోకి వెళ్లి బాబు ప్రగల్బాలు పలికాడు.

సముద్రాన్ని నియంత్రించానని, ఏటా సైక్లోన్ డే అని చంద్రబాబు నాయుడు ఏదేదో మాట్లాడాడు. ఇక కొందరు బాధితులను గట్టిగా హెచ్చరించాడు కూడా. వాళ్లపై బుల్డోజర్ ఎక్కించి తొక్కిస్తా అని కూడా బాబు హెచ్చరించాడు.

ఇదీ శ్రీకాకుళానికి చంద్రబాబు చేసిన సాయం. దీనికి గానూ టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి. మరి పచ్చ పార్టీ దివాళాకోరుతనంలో దీన్ని పరాకాష్ట అనాలేమో!

First Published:  23 Oct 2018 5:20 AM GMT
Next Story