Telugu Global
NEWS

ప్రత్యర్థి పరామర్శించాడు.... అధికారపార్టీ అభ్యర్థి పాడె మోశాడు

సీఎం కేసీఆర్ ఆదేశించారు…. ప్రచారాన్ని ముమ్మరం చేయమని. ఇంకేం…. టీఆర్ఎస్ అభ్యర్థులు కార్యక్షేత్రంలోకి దూకేశారు. కన్నుమిన్ను, సమయం సందర్భం అంటూ లేదూ…. కేవలం ఓట్లు పడడమే పరమావధిగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి పిల్లాడి ముడ్డి కడుగుతూ చొప్పదండి నియోజకవర్గంలో కెమెరా కంటికి చిక్కాడు. ఈరోజు స్వయంగా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి…. తన ప్రత్యర్థి గండ్ర సత్యనారాయణరావు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాడని తెలిసి…. ఈయన ఏకంగా […]

ప్రత్యర్థి పరామర్శించాడు.... అధికారపార్టీ అభ్యర్థి పాడె మోశాడు
X

సీఎం కేసీఆర్ ఆదేశించారు…. ప్రచారాన్ని ముమ్మరం చేయమని. ఇంకేం…. టీఆర్ఎస్ అభ్యర్థులు కార్యక్షేత్రంలోకి దూకేశారు. కన్నుమిన్ను, సమయం సందర్భం అంటూ లేదూ…. కేవలం ఓట్లు పడడమే పరమావధిగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.

నిన్నటికి నిన్న ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి పిల్లాడి ముడ్డి కడుగుతూ చొప్పదండి నియోజకవర్గంలో కెమెరా కంటికి చిక్కాడు. ఈరోజు స్వయంగా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి…. తన ప్రత్యర్థి గండ్ర సత్యనారాయణరావు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాడని తెలిసి…. ఈయన ఏకంగా పాడె మోశాడు. ఇలాంటి అరుదైన చిత్రాలు కేవలం ఈ ఎన్నికల సమయంలోనే సాధ్యం. ఆ తర్వాత ఈ నేతలు మన కంటికైనా కనిపించరని స్థానికులు బహిరంగంగానే అంటున్నారు.

తాజాగా భూపాలపల్లిలోని రాంనగర్ లో ఎన్నడూ చూడని ఎన్నికల చిత్రం చోటుచేసుకుంది. పెండ్యాల కిషన్ అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో చనిపోగా ఆయన్ను పరామర్శించడానికి కాంగ్రెస్, స్వతంత్ర్య ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు వచ్చి వెళ్లారు. నేనెక్కడ వెనుకబడి పోతానో అని గ్రహించిన స్పీకర్ మధుసూదనాచారి ఏకంగా అక్కడికి వెళ్లి అంతిమయాత్రలో పాడె మోశారు.

హిందూ ఆచారాల్లో పాడె, శవయాత్రలో పాల్గొనడం…. స్నానాలు చేయడం…. పెద్ద తంతుగా భావిస్తారు. కానీ ఎన్నికల వేళ కేవలం ఓట్ల కోసం ఇలా అన్నీ వదిలేసి నేతలు పాకులాడడం చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఎన్నికల తర్వాత కూడా నేతలు ఇలానే ఉంటే ఎంత బావుండు అని అక్కడి జనాలు అనుకుంటున్నారు.

First Published:  22 Oct 2018 11:35 PM GMT
Next Story