Telugu Global
NEWS

బాబు సర్కార్‌కు ఎదురుదెబ్బ... ఎన్నికలకు హైకోర్టు ఆదేశం

చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తీర్పు చెప్పింది. ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లతో పాలన చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ని హైకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 1 నుంచి ఏపీలో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ప్రత్యేకాధికారుల పాలనతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని హైకోర్టులో మాజీ సర్పంచ్ లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు… జీవో 90ని కొట్టివేసింది. […]

బాబు సర్కార్‌కు ఎదురుదెబ్బ... ఎన్నికలకు హైకోర్టు ఆదేశం
X

చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తీర్పు చెప్పింది.

ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లతో పాలన చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ని హైకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 1 నుంచి ఏపీలో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది.

ప్రత్యేకాధికారుల పాలనతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని హైకోర్టులో మాజీ సర్పంచ్ లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు… జీవో 90ని కొట్టివేసింది. 12వేల 888 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం తెలంగాణ పంచాయతీ ఎన్నికల విషయంలోనూ హైకోర్టు ఇదే తరహా తీర్పు ఇచ్చింది.

ప్రత్యేకాధికారుల పాలన చెల్లదని స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపుతూ ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా దాటవేస్తోంది.

First Published:  23 Oct 2018 2:03 AM GMT
Next Story