Telugu Global
NEWS

ఇప్పుడా రావడం.... రామ్మోహన్‌ నాయుడిని వెళ్లగొట్టిన గ్రామస్తులు

తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను వణికించి 12 రోజులు అవుతోంది. చంద్రబాబు మాత్రం తిత్లీ తాటా తీసేశామంటున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్నారు. సర్వం కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నారు. తాగేందుకు నీరు కూడా అందని దుస్థితి. సాయం అందడం లేదు గానీ… టీడీపీ నేతలు వరుసగా పర్యటనలు చేస్తున్నారు. దీంతో బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చాపురం నియోజవర్గంలోని తొనగానపుట్టిగ గ్రామంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడికి ప్రజల నుంచి […]

ఇప్పుడా రావడం.... రామ్మోహన్‌ నాయుడిని వెళ్లగొట్టిన గ్రామస్తులు
X

తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను వణికించి 12 రోజులు అవుతోంది. చంద్రబాబు మాత్రం తిత్లీ తాటా తీసేశామంటున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్నారు. సర్వం కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నారు. తాగేందుకు నీరు కూడా అందని దుస్థితి.

సాయం అందడం లేదు గానీ… టీడీపీ నేతలు వరుసగా పర్యటనలు చేస్తున్నారు. దీంతో బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చాపురం నియోజవర్గంలోని తొనగానపుట్టిగ గ్రామంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడికి ప్రజల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది.

కారు డోర్‌ వద్దే నిలబడి ప్రజలకు రామ్మోహన్‌ నాయుడు అభివాదం చేసి… అందరినీ ఆదుకుంటామని చెప్పగానే స్థానికులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తుపాను వచ్చి 12 రోజలు దాటినా ఇంకా సాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగేందుకు కూడా నీరు ఇవ్వలేనప్పుడు పరామర్శలకు ఎందుకు వస్తున్నారంటూ రామ్మోహన్‌ నాయుడిని నిలదీశారు.

తమకు మాటలతో కడుపు నింపే పరిస్థితి లేదని నినాదాలు చేశారు. కొందరు మీతో మాకు అవసరమే లేదు వెళ్లిపోండి అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. రామ్మోహన్‌ నాయుడు మాటలు వినేందుకు కూడా గ్రామస్తులు సిద్ధపడలేదు. దీంతో అసహనంగానే కారులో కూర్చుని అక్కడి నుంచి రామ్మోహన్‌నాయుడు వెళ్లిపోయారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు భద్రతను మాత్రం కట్టుదిట్టంగానే కొనసాగిస్తున్నారు.

First Published:  22 Oct 2018 1:12 AM GMT
Next Story