Telugu Global
Cinema & Entertainment

'ఆకు చాటు' బాలయ్య అదరగొట్టాడు

ఆకు చాటు పిందె తడిసె అనేది పెద్ద ఎన్టీఆర్ నటించిన వేటగాడు సినిమాలో సూపర్ హిట్ సాంగ్. ఆ పాటను యథాతథంగా ఎన్టీఆర్ బయోపిక్ లో దించేశారు. అదే సెట్, అవే స్టెప్పులు, అవే గెటప్పులు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే శ్రీదేవి పాత్రధారి రకుల్ స్టిల్ ను విడుదల చేశారు. ఇప్పుడు అదే పాట నుంచి బాలయ్య గెటప్ ను బయటపెట్టారు మేకర్స్. ఆకుచాటు పాటలో సీనియర్ ఎన్టీఆర్ ఎలా కనిపించారో, అచ్చుగుద్దినట్టు అదే ఛాయల్లో […]

ఆకు చాటు బాలయ్య అదరగొట్టాడు
X

ఆకు చాటు పిందె తడిసె అనేది పెద్ద ఎన్టీఆర్ నటించిన వేటగాడు సినిమాలో సూపర్ హిట్ సాంగ్. ఆ పాటను యథాతథంగా ఎన్టీఆర్ బయోపిక్ లో దించేశారు. అదే సెట్, అవే స్టెప్పులు, అవే గెటప్పులు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే శ్రీదేవి పాత్రధారి రకుల్ స్టిల్ ను విడుదల చేశారు. ఇప్పుడు అదే పాట నుంచి బాలయ్య గెటప్ ను బయటపెట్టారు మేకర్స్.

ఆకుచాటు పాటలో సీనియర్ ఎన్టీఆర్ ఎలా కనిపించారో, అచ్చుగుద్దినట్టు అదే ఛాయల్లో బాలయ్య అదరగొట్టాడు. పనిలో పనిగా ఇదే ఫొటోతో కాస్త లేట్ అయినా దసరా శుభాకాంక్షలు, ఇంకాస్త ముందుగా దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి బాలయ్య నుంచి కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ఇది అదనం అన్నమాట.

మరోవైపు ఇదే సినిమాలో తమన్న కూడా నటిస్తోంది. శ్రీదేవి పాత్రకు రకుల్ ను తీసుకున్నట్టే.. జయప్రద పాత్రకు తమన్నాను తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పై కూడా ఉంది. సో.. రేపోమాపో తమన్న ఫస్ట్ లుక్ కూడా రాబోతోందన్నమాట.

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయిన కొత్తలో వరుసగా స్టిల్స్ లీక్ అయ్యాయి. దీంతో ఇక లాభం లేదని భావించి, మేకర్సే ఇలా ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల సినిమా స్టిల్స్ లీక్ అయ్యే ఆస్కారం లేదు. పైగా ప్రచారం కూడా.

First Published:  22 Oct 2018 7:32 AM GMT
Next Story