Telugu Global
NEWS

100 కాదు 800 కోట్లు.. కిడారికి 7 కోట్లు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడైన  సీఎం రమేష్‌పై జరిగిన ఐటీ దాడుల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఐటీ తనను ఏమీ చేయలేదని మీడియా సమావేశంలో మీసం తిప్పిన సీఎం రమేష్‌ ఇప్పుడు మీడియా ముందు కనిపించడం లేదు. కారణం ఐటీ శాఖ సీఎం రమేష్ కంపెనీల్లో భారీ అక్రమాలను గుర్తించడమే. మొత్తం 800 కోట్ల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు నిర్దారించారు. అందులో 100 కోట్లకు సంబంధించిన అక్రమాలపై పక్కా ఆధారాలు […]

100 కాదు 800 కోట్లు.. కిడారికి 7 కోట్లు..
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడైన సీఎం రమేష్‌పై జరిగిన ఐటీ దాడుల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఐటీ తనను ఏమీ చేయలేదని మీడియా సమావేశంలో మీసం తిప్పిన సీఎం రమేష్‌ ఇప్పుడు మీడియా ముందు కనిపించడం లేదు. కారణం ఐటీ శాఖ సీఎం రమేష్ కంపెనీల్లో భారీ అక్రమాలను గుర్తించడమే.

మొత్తం 800 కోట్ల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు నిర్దారించారు. అందులో 100 కోట్లకు సంబంధించిన అక్రమాలపై పక్కా ఆధారాలు సేకరించింది. ఈ విషయాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ డాక్యుమెంట్లతో సహా బయటపెట్టిన తర్వాత సీఎం రమేష్ కనిపించడం లేదు. మీడియా ప్రతినిధులు ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే వెళ్లి ఐటీ అధికారులనే అడగండి అంటూ తప్పించుకుంటున్నారు.

వంద కోట్లకు పక్కా ఆధారాలను సేకరించిన ఐటీ… మరో 700 కోట్ల అనుమానాస్పద లావాదేవీలపై ఆధారాలు సేకరించేపనిలో ఉంది. డమ్మీ కంపెనీలను సృష్టించి బిల్లుల పేరుతో సదరు కంపెనీల్లోకి డబ్బు మళ్లించి… తిరిగి ఆ డమ్మీ కంపెనీల ఖాతాల నుంచి నగదు రూపంలో డబ్బు విత్‌ డ్రా చేసుకున్నారు.

ఇలా నగదుగా చేతుల్లోకి వచ్చిన డబ్బుతోనే ఎమ్మెల్యేలను కొనుగోళ్లను చేసినట్టు చెబుతున్నారు. ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ ఫిరాయించినందుకు చెల్లించిన డబ్బులో ఏడు కోట్ల రూపాయలు సీఎం రమేష్ కంపెనీ నుంచే వెళ్లినట్టు ఐటీ గుర్తించినట్టు సమాచారం.

విశాఖపట్నానికి చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి ఖాతాలోకి తొలుత ఈ ఏడు కోట్లు మళ్లించారు. ఒకే సారి ఏడు కోట్ల ఖాతాలోకి పడితే ఇబ్బందులు వస్తాయని సదరు అనుచరులు ఎమ్మెల్యే వద్ద ఆందోళన చేయగా… ఆ సొమ్ము కిడారికి ఇవ్వడానికి వేశారని ఆందోళన వద్దని సూచించారని తేలింది. ఇలా ఎమ్మెల్యేల కొనుగోళ్లలో అత్యధిక సొమ్ము సీఎం రమేష్ కంపెనీల ద్వారానే వచ్చినట్టు తేల్చారు.

First Published:  19 Oct 2018 9:31 PM GMT
Next Story