Telugu Global
NEWS

బాబు పాలనా వైఫల్యం.. అంధకారంలోనే శ్రీకాకుళం గ్రామాలు..

తిత్లి తుఫాను ధాటికి మొత్తం దక్షిణాది ఇబ్బందిపడింది. ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే విద్యుత్ లైన్లు తుఫాన్ ధాటికి కుప్పకూలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే అందుబాటులో ఉన్న వనరులు, ఎక్కువ ధరకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల విద్యుత్ కొని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి కరెంట్ కొరతలు లేకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని తాజాగా ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఎనర్జీ) అజయ్ జైన్ ప్రకటనను బట్టి అర్థమవుతోంది. […]

బాబు పాలనా వైఫల్యం.. అంధకారంలోనే శ్రీకాకుళం గ్రామాలు..
X

తిత్లి తుఫాను ధాటికి మొత్తం దక్షిణాది ఇబ్బందిపడింది. ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే విద్యుత్ లైన్లు తుఫాన్ ధాటికి కుప్పకూలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే అందుబాటులో ఉన్న వనరులు, ఎక్కువ ధరకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల విద్యుత్ కొని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి కరెంట్ కొరతలు లేకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని తాజాగా ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఎనర్జీ) అజయ్ జైన్ ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్లిప్తత కారణంగా శ్రీకాకుళంలోని వందలాది గ్రామాలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నట్లు సమాచారం.

తాజాగా అజయ్ జైన్ మాట్లాడుతూ.. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న విద్యుత్ టవర్లు, స్తంభాలు మళ్లీ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని.. అక్టోబర్ 22 వరకూ శ్రీకాకుళంలోని గ్రామాలకు పూర్తి స్థాయి విద్యుత్ అందజేస్తామని వివరణ ఇచ్చారు. తుఫాను ధాటికి దాదాపు 33వేల ఎలక్ట్రిసిటీ పోల్స్ కూలిపోయాయని.. విద్యుత్ తీగలు సైతం తెగిపోయాయని వివరించారు. విద్యుత్ సరఫరా చేసే 101… 33కేవీ సబ్ స్టేషన్లు దెబ్బతింటే అందులో 93 వాటిని పునురుద్ధరించామని తెలిపారు. హైటెన్షన్ టవర్లను కూడా ఈరోజు నిర్మించి కనెక్టివిటీ ఇచ్చామని తెలిపారు. ఇందుకోసం 10వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని వివరణ ఇచ్చారు.

ఏపీకి న్యాయం చేయడంలో అటు కేంద్రం మొండి వైఖరి.. ఇటు చంద్రబాబు నిర్లిప్తత కారణంగా తుఫాను వచ్చి పోయి వారం గడిచినా ఇంకా పరిస్థితి సద్దుమణగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళంలోని గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయని ప్రముఖ ఆంగ్లపత్రికలు తాజాగా ప్రచురించడం పరిస్థితికి అద్దం పడుతోంది. తెలంగాణ, ఇతర రాష్ట్రాల వలే వేగంగా స్పందించని బాబు వైఖరిపై స్థానిక జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  20 Oct 2018 4:44 AM GMT
Next Story