Telugu Global
Cinema & Entertainment

కొత్త సినిమాపై క్లారిటీ ఇవ్వని రామ్

ఒక సినిమా సెట్స్ పై కొనసాగుతుండగానే, మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు హీరోలు. దాదాపు హీరోలంతా చేతిలో కనీసం ఒక్క సినిమా అయినా పెట్టుకుంటారు. అయితే రామ్ మాత్రం ఎలాంటి క్లారిటీ లేకుండా ఉన్నాడు. హలో గురు ప్రేమకోసమే సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ, నెక్ట్స్ సినిమా గురించి చెప్పలేకపోతున్నాడు రామ్. “ప్రస్తుతానికైతే మరో సినిమా అనుకోలేదు. 2-3 సినిమాలు చర్చల్లో ఉన్నాయి. కానీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఆ మధ్య పూరి జగన్నాథ్ తో కూడా […]

కొత్త సినిమాపై క్లారిటీ ఇవ్వని రామ్
X
ఒక సినిమా సెట్స్ పై కొనసాగుతుండగానే, మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు హీరోలు. దాదాపు హీరోలంతా చేతిలో కనీసం ఒక్క సినిమా అయినా పెట్టుకుంటారు. అయితే రామ్ మాత్రం ఎలాంటి క్లారిటీ లేకుండా ఉన్నాడు. హలో గురు ప్రేమకోసమే సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ, నెక్ట్స్ సినిమా గురించి చెప్పలేకపోతున్నాడు రామ్.
“ప్రస్తుతానికైతే మరో సినిమా అనుకోలేదు. 2-3 సినిమాలు చర్చల్లో ఉన్నాయి. కానీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఆ మధ్య పూరి జగన్నాథ్ తో కూడా చర్చలు జరిగాయి. మేమిద్దరం ఎప్పటికప్పుడు రకరకాల స్టోరీల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఏదీ ఫైనలైజ్ కాలేదు.”
ఇలా తన అప్ కమింగ్ మూవీపై రియాక్ట్ అయ్యాడు రామ్. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, కొన్నేళ్లుగా రామ్ పరిస్థితి ఇదే. ప్రాజెక్టులు పెండింగులో పెడతాడు కానీ ఏదీ ఓ పట్టాన ఓకే చేయడు. అందుకే ఇతడికి పెద్ద దర్శకులతో సినిమాలు సెట్ అవ్వవనే ప్రచారం కూడా నడుస్తోంది.
మరోవైపు గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో చేయాల్సిన సినిమా కూడా వదులుకున్నాడు రామ్. ఈ హీరో మార్కెట్ కంటే, ప్రవీణ్ సత్తారు చెప్పిన సినిమా బడ్జెట్ రెండింతలు ఉందట. అందుకే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రకటించాడు రామ్. హలో గురు ప్రేమకోసమే రిజల్ట్ పై రామ్ నెక్ట్స్ సినిమా ఆధారపడి ఉంది.
First Published:  17 Oct 2018 5:16 AM GMT
Next Story