Telugu Global
NEWS

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత సాయిరాజు ఆత్మహత్యాయత్నం చేశారు. తిత్లీ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితులు వారం రోజులుగా మంచినీటి కోసం అలమటిస్తున్నారు. అయినా సరే అధికారులు, యంత్రాంగం స్పందించలేదు. దీంతో సోంపేటలో ప్రజలు ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వారికి సమాధానం చెప్పేందుకు కూడా కార్యాలయంలో ఎవరూ లేరు. బాధితులకు అండగా ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సాయిరాజు…. ప్రభుత్వ తీరును […]

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం
X

శ్రీకాకుళం జిల్లా సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత సాయిరాజు ఆత్మహత్యాయత్నం చేశారు. తిత్లీ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితులు వారం రోజులుగా మంచినీటి కోసం అలమటిస్తున్నారు.

అయినా సరే అధికారులు, యంత్రాంగం స్పందించలేదు. దీంతో సోంపేటలో ప్రజలు ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వారికి సమాధానం చెప్పేందుకు కూడా కార్యాలయంలో ఎవరూ లేరు. బాధితులకు అండగా ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సాయిరాజు…. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఒంటిపై తానే పెట్రోల్ పోసుకున్నారు. పోలీసులు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు.

తుపాను వల్ల బాధితులు అల్లాడుతుండగా… వారికి నీరు, ఆహారం అందజేసే విషయంలోనూ జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించారు. దాంతో వారు తొలుత టీడీపీ సానుభూతిపరులకే నీటిని, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. కడుపు మండిన సామాన్యులు విపత్తులోనూ ఈ జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తూ ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

First Published:  16 Oct 2018 1:30 AM GMT
Next Story