Telugu Global
Cinema & Entertainment

"ఆర్ ఆర్ ఆర్" ఆ సినిమాకి రీమేకా?

ఎస్.ఎస్ రాజమౌళి తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే “బాహుబలి” సినిమాతో రాజమౌళి క్రియేట్ చేసుకున్న క్రేజ్ అలాంటిది మరి. అయితే రాజమౌళి తన తదుపరి సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లని హీరోలుగా పెట్టి ఒక మల్టీ స్టారర్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక బాలీవుడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందీ లో అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, ప్రియాంక […]

ఆర్ ఆర్ ఆర్ ఆ సినిమాకి రీమేకా?
X

ఎస్.ఎస్ రాజమౌళి తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే “బాహుబలి” సినిమాతో రాజమౌళి క్రియేట్ చేసుకున్న క్రేజ్ అలాంటిది మరి. అయితే రాజమౌళి తన తదుపరి సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లని హీరోలుగా పెట్టి ఒక మల్టీ స్టారర్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక బాలీవుడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

హిందీ లో అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన “గుండే” సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుందట. ఈ సినిమాను తారక్, చరణ్ ల స్టార్ ఇమేజ్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. రాజమౌళి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తారు. మరి ఇలాంటి టైం లో రాజమౌళి రీమేక్ కథని తీసుకోవడం కరెక్టేనా? అని కొందరి భావన. కానీ కొందరు మాత్రం కేవలం క్యారెక్టర్స్ మాత్రమే ఆ సినిమా తరహాలో ఉంటాయి అని కథ మాత్రం పూర్తిగా వేరే ఉంటుంది అని అంటున్నారు. ఇంకా ఈ సినిమా గురించి పూర్తి విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  15 Oct 2018 8:32 PM GMT
Next Story