Telugu Global
National

రాహుల్ చెప్పినా వినని చిరంజీవి

కాంగ్రెస్‌కు మాజీ కేంద్రమంత్రి, నటుడు చిరంజీవి దాదాపు గుడ్‌బై చెప్పినట్టుగానే భావిస్తున్నారు. 2014 తర్వాత రాజకీయాల్లో చురుగ్గా లేని చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత రాజకీయాలకు మరింత దూరంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు జీవం పోయాలని చూస్తున్న రాహుల్ గాంధీ ఇటీవల స్వయంగా చిరంజీవితో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని క్రీయాశీలకంగా పనిచేయాలని కోరారు. అప్పటికీ చిరంజీవి నుంచి స్పందన లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా ఇటీవల ముగిసింది. చీరంజీవి […]

రాహుల్ చెప్పినా వినని చిరంజీవి
X

కాంగ్రెస్‌కు మాజీ కేంద్రమంత్రి, నటుడు చిరంజీవి దాదాపు గుడ్‌బై చెప్పినట్టుగానే భావిస్తున్నారు. 2014 తర్వాత రాజకీయాల్లో చురుగ్గా లేని చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత రాజకీయాలకు మరింత దూరంగా ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు జీవం పోయాలని చూస్తున్న రాహుల్ గాంధీ ఇటీవల స్వయంగా చిరంజీవితో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని క్రీయాశీలకంగా పనిచేయాలని కోరారు. అప్పటికీ చిరంజీవి నుంచి స్పందన లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా ఇటీవల ముగిసింది.

చీరంజీవి మాత్రం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా పునరుద్దరించుకోలేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌కు దాదాపు దూరమై పోయినట్టే. ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రాహుల్ చెప్పినా స్పందించకపోవడం, పార్టీ సభ్యత్వాన్ని పునరుద్దరించుకోకపోవడం బట్టి చిరంజీవి అనధికారికంగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినట్టుగానే భావిస్తున్నారు.

First Published:  16 Oct 2018 7:32 AM GMT
Next Story