Telugu Global
NEWS

లోకేష్.... ఉత్తి ధన్యవాదాలేనా? రూపాయి కూడా ఇవ్వవా?

తిత్లీ బాధితుల కోసం ఆర్థిక సాయం చేసిన వారికి ధన్యవాదాలు చెప్పాడు లోకేష్ బాబు. ఈ ట్విట్టర్ పొలిటీషియన్ వాళ్లందరికీ ట్వీట్లు పెట్టి ధన్యవాదాలు చెబుతున్నాడు. ఈ ధన్యవాదాలు చెప్పే కథ బాగానే ఉంది కానీ.. లోకేష్ ఎందుకు వ్యక్తిగతంగా స్పందించడం లేదు? ఎందుకు తన కుటుంబం తరఫు నుంచి స్పందించడం లేదు? ఎందుకు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రూపాయి కూడా విపత్తు బాధితుల కోసం సాయం చేయడం లేదు? అనేది గమనించాల్సిన అంశం. తెలుగుదేశం […]

లోకేష్.... ఉత్తి ధన్యవాదాలేనా? రూపాయి కూడా ఇవ్వవా?
X

తిత్లీ బాధితుల కోసం ఆర్థిక సాయం చేసిన వారికి ధన్యవాదాలు చెప్పాడు లోకేష్ బాబు. ఈ ట్విట్టర్ పొలిటీషియన్ వాళ్లందరికీ ట్వీట్లు పెట్టి ధన్యవాదాలు చెబుతున్నాడు. ఈ ధన్యవాదాలు చెప్పే కథ బాగానే ఉంది కానీ.. లోకేష్ ఎందుకు వ్యక్తిగతంగా స్పందించడం లేదు? ఎందుకు తన కుటుంబం తరఫు నుంచి స్పందించడం లేదు? ఎందుకు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రూపాయి కూడా విపత్తు బాధితుల కోసం సాయం చేయడం లేదు? అనేది గమనించాల్సిన అంశం.

తెలుగుదేశం పార్టీకి బోలెడన్ని ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లున్నాయి. అవతల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ తరఫు నుంచి బాధితులకు సాయం అందిస్తోంది. మొన్నామధ్య కేరళ వరదల సమయంలోనూ.. ఇప్పుడు శ్రీకాకుళంను తిప్పలు పెట్టిన తుఫాన్ బాధితుల కోసం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వంతుగా సాయం అందించింది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం స్పందించడం లేదు.

ఇప్పుడు టీడీపీకి ఫండ్స్ కొదవ ఏమీ లేదు. కోట్ల రూపాయల నిధులున్నాయి. ఇవ్వాలనుకుంటే పార్టీ ఖాతా నుంచి సాయం చేయవచ్చు.

అంతే కాదు చంద్రబాబు కుటుంబానికి హెరిటేజ్ సంస్థ ఉండనే ఉంది. ఆ సంస్థ యజమానులుగా నారా కుటుంబీకులు కోట్ల రూపాయల సొమ్ములు జీతాలుగా తీసుకుంటున్నారు. హెరిటేజ్ సంస్థ తరఫు నుంచి కానీ.. నారా కుటుంబీకులు వ్యక్తిగతంగా కానీ డబ్బులు ఇవ్వొచ్చు. అయితే అదీ జరగలేదు. ఇక చంద్రబాబు, లోకేష్ లు తమ వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు ఇవ్వొచ్చు. కానీ ఇవ్వలేదు.

ఇచ్చిన వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాడు లోకేష్. అది కూడా అందరికీ కాదు. కొందరికే. ఇలాంటి పనులు తప్ప ప్రజల కోసం ఉపయోగపడే పనులను లోకేష్ చేయలేడా?

First Published:  16 Oct 2018 5:43 AM GMT
Next Story