Telugu Global
International

కోహినూర్ వజ్రాన్ని... కొట్టేసారా? అప్పగించారా?

కోహినూర్ వజ్రం అప్పగింతపై సందిగ్ధత వీడటం లేదు. ఎప్పటి నుంచో వివాదంగా ఉన్న విషయం ఇప్పటికీ తేలలేదు. ఆ వజ్రంపై ఉన్న ఆసక్తి అటువంటిది. భారత దేశ అపురూప సంపదల్లో ఒకటిగా కోహినూర్ నిలవడమే ఇందుకు కారణం. తాజాగా రోహిత్ సబర్వాల్ అనే యాక్టివిస్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేశాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. బ్రిటీషు వారు కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడం గానీ, బలవంతంగా తీసుకెళ్లడం […]

కోహినూర్ వజ్రాన్ని... కొట్టేసారా? అప్పగించారా?
X

కోహినూర్ వజ్రం అప్పగింతపై సందిగ్ధత వీడటం లేదు. ఎప్పటి నుంచో వివాదంగా ఉన్న విషయం ఇప్పటికీ తేలలేదు. ఆ వజ్రంపై ఉన్న ఆసక్తి అటువంటిది. భారత దేశ అపురూప సంపదల్లో ఒకటిగా కోహినూర్ నిలవడమే ఇందుకు కారణం.

తాజాగా రోహిత్ సబర్వాల్ అనే యాక్టివిస్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేశాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. బ్రిటీషు వారు కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడం గానీ, బలవంతంగా తీసుకెళ్లడం గానీ చేయలేదని ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టతనిచ్చింది. ఆంగ్లో – సిక్కు యుద్ధానికి అయిన ఖర్చుకు గాను మహారాజా రంజిత్ సింగ్ స్వచ్ఛందంగా అప్పగించినట్లు పేర్కొంది.

అయితే, ఇందుకు సంతృప్తి పడని సబర్వాల్.. ఆర్టీఐ కింద సమాచారాన్ని నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని అడిగాడు. వారు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు బదిలీ చేశారు. అక్కడున్న రికార్డుల ప్రకారం 1849 నాటి డల్హౌసీ, మహారాజా దులీప్ సింగ్ మధ్య జరిగిన ఒప్పంద పత్రాలను బయటకు తీశారు. అందులో షా-సుజా-ఉల్ ముల్క్ నుంచి స్వీకరించిన వజ్రాన్ని క్వీన్ ఎలిజిబెత్ కు మహారాజా రంజిత్ సింగ్ ఇచ్చాడని అందులో పేర్కొన్నారు.

దీనిపై మహారాజా దులీప్ సింగ్ మెమోరియల్ ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ కోహీనూర్ వజ్రాన్ని ఇష్టపూర్వకంగా ఇవ్వలేదన్న విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. వజ్రం అప్పగించే నాటికి మహారాజా రంజిత్ సింగ్ వయసు 9 సంవత్సరాలేనని అంటున్నారు. ఆ వయసులో ఎలిజిబెత్ రాణికి వజ్రం అప్పగించేంత మెచ్యూరిటీ ఉండదని అంటున్నారు. అయితే, కోహినూర్ వజ్రం అప్పగింతపై ఉన్న సస్పెన్స్ మాత్రం వీడలేదు.

First Published:  16 Oct 2018 5:35 AM GMT
Next Story