Telugu Global
NEWS

దేవేంద‌ర్ గౌడ్ ఆ సీటునుంచి పోటీ చేస్తారట?

తెలుగుదేశం సీనియ‌ర్ నేత దేవేంద‌ర్‌గౌడ్ మ‌ళ్లీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యాడు. తెలంగాణ తెలుగుదేశం మేనిఫెస్టో క‌మిటీ ఛైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్నాడు. తెలుగుదేశం త‌ర‌పున మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌లో ఆయ‌న పాలుపంచుకుంటున్నాడు. గ‌తంలో హోం మంత్రిగా ప‌నిచేసిన దేవేంద‌ర్‌గౌడ్ న‌వ తెలంగాణ పార్టీ స్థాపించాడు. ఆ పార్టీని ఆత‌ర్వాత 2009 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జారాజ్యం పార్టీలో విలీనం చేశాడు. 2009 ఎన్నికల్లో ఆయ‌న గెల‌వ‌లేక‌పోయాడు. చివ‌ర‌కు అనారోగ్యం బారిన ప‌డ‌డంతో 2014 ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నాడు. కానీ ఆయ‌న త‌న‌యుడు వీరేంద‌ర్ […]

దేవేంద‌ర్ గౌడ్ ఆ సీటునుంచి పోటీ చేస్తారట?
X

తెలుగుదేశం సీనియ‌ర్ నేత దేవేంద‌ర్‌గౌడ్ మ‌ళ్లీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యాడు. తెలంగాణ తెలుగుదేశం మేనిఫెస్టో క‌మిటీ ఛైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్నాడు. తెలుగుదేశం త‌ర‌పున మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌లో ఆయ‌న పాలుపంచుకుంటున్నాడు. గ‌తంలో హోం మంత్రిగా ప‌నిచేసిన దేవేంద‌ర్‌గౌడ్ న‌వ తెలంగాణ పార్టీ స్థాపించాడు. ఆ పార్టీని ఆత‌ర్వాత 2009 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జారాజ్యం పార్టీలో విలీనం చేశాడు. 2009 ఎన్నికల్లో ఆయ‌న గెల‌వ‌లేక‌పోయాడు. చివ‌ర‌కు అనారోగ్యం బారిన ప‌డ‌డంతో 2014 ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నాడు. కానీ ఆయ‌న త‌న‌యుడు వీరేంద‌ర్ గౌడ్ టీడీపీ నుంచి పోటీ చేశాడు. చేవేళ్ల ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోయాడు.

ప్ర‌స్తుతం దేవేంద‌ర్‌గౌడ్ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ యాక్టీవ్ కావాలని కోరుకుంటున్నాడు. మ‌హాకూట‌మి సీట్ల స‌ర్దుబాటు వ్య‌వ‌హారం కొన‌సాగుతోంది. దేవేంద‌ర్‌గౌడ్ కొడుకు వీరేంద‌ర్‌గౌడ్ ఉప్ప‌ల్ నుంచి పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. టీడీపీకి ఉప్ప‌ల్ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించింది. దీంతో ఉప్ప‌ల్‌లో వీరేంద‌ర్ గౌడ్ ప్రచారానికి సిద్ధమవుతున్నాడట.

మ‌రోవైపు దేవేంద‌ర్‌గౌడ్ కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని అనుకుంటున్నాడట. మేడ్చ‌ల్ నుంచి మూడుసార్లు దేవేంద‌ర్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2009లో జరిగిన నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న‌లో మేడ్చ‌ల్ స్వ‌రూపం మారిపోయింది. దీంతో ఆయన కొడుకును ఉప్ప‌ల్ నుంచి పోటీ చేయించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు.

మ‌రోవైపు రాజేంద‌ర్‌న‌గ‌ర్ నుంచి ఆయ‌న పోటీ చేసే ఆలోచ‌న‌ చేస్తున్నారు. స‌న్నిహితుల ద‌గ్గ‌ర రాజేంద‌ర్‌న‌గ‌ర్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంద‌ని అడిగిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట ప‌డుతోంది. మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌ని అనుకుంటున్నారు. అయితే కుటుంబ‌స‌భ్యులు మాత్రం వ‌ద్ద‌ని వారిస్తున్నార‌ని స‌మాచారం. కూట‌మి సీట్ల స‌ర్దుబాటు జ‌రిగితే టీడీపీ పోటీ చేసే స్థానాలపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. అప్పుడే పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ని అంటున్నారు.

First Published:  15 Oct 2018 7:20 PM GMT
Next Story