Telugu Global
NEWS

10వేల కోట్లకు అమరావతి తాకట్టు....

శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఇటుక కూడా అమరావతిలో ఇప్పటి వరకు పడలేదు. కానీ అమరావతి మాత్రం అప్పుల్లో కూరుకుపోతోంది. నాలుగేళ్ల క్రితం వరకు మూడు పంటలు పండిన భూములు ఇప్పుడు విదేశీ సంస్థలకు ధారదత్తం అవుతున్నాయి. బ్యాంకుల్లో తాకట్టుకు వెళ్తున్నాయి. ఇదంతా ఘనమైన చంద్రబాబు చేస్తున్న పనే. ఇప్పటికే అమరావతి బాండ్ల పేరుతో బాంబే స్టాక్ ఎక్సైంజ్‌లో గంట కొట్టి మరీ అధిక వడ్డీకి రెండు వేల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు. వేల ఎకరాలు సింగపూర్‌ […]

10వేల కోట్లకు అమరావతి తాకట్టు....
X

శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఇటుక కూడా అమరావతిలో ఇప్పటి వరకు పడలేదు. కానీ అమరావతి మాత్రం అప్పుల్లో కూరుకుపోతోంది. నాలుగేళ్ల క్రితం వరకు మూడు పంటలు పండిన భూములు ఇప్పుడు విదేశీ సంస్థలకు ధారదత్తం అవుతున్నాయి. బ్యాంకుల్లో తాకట్టుకు వెళ్తున్నాయి. ఇదంతా ఘనమైన చంద్రబాబు చేస్తున్న పనే.

ఇప్పటికే అమరావతి బాండ్ల పేరుతో బాంబే స్టాక్ ఎక్సైంజ్‌లో గంట కొట్టి మరీ అధిక వడ్డీకి రెండు వేల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు. వేల ఎకరాలు సింగపూర్‌ సంస్థలకు రాసిచ్చారు. మనం భూములిస్తే చాలు సింగపూర్ కంపెనీలే రాజధాని కడుతాయని నమ్మించిన బాబు… ఇప్పుడు రాజధానిలోని భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 10వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు సీఆర్‌డీఏకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వాణిజ్య బ్యాంకుల నుంచి ఈ అప్పు తీసుకునేలా అనుమతినిస్తూ సోమవారం జీవో జారీ చేశారు. అంటే సీఆర్ డీఏ తీసుకునే అప్పుకు ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. తొలుత ఈ పది వేల కోట్ల అప్పును సీఆర్‌డీఏనే తిరిగి చెల్లించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసినా… అప్పుకు ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడంతో ఒకవేళ సీఆర్‌డీఏ చేతులు ఎత్తేస్తే ప్రభుత్వమే ఈ అప్పును బ్యాంకులకు చెల్లించాలి. లేదంటే తాకట్టు పెట్టిన వేల ఎకరాల రాజధాని భూములను బ్యాంకులు స్వాధీనం చేసుకుంటాయి.

ఇదే సమయంలో అమరావతి బాండ్ల పబ్లిక్ ఇష్యూ ద్వారా మరో 500 కోట్లు సేకరించేందుకు లీడ్ మేనేజర్ల కోసం సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. మొత్తం మీద ప్రభుత్వం తీరు చూస్తుంటే రాజధాని శాశ్వత కట్టడాలు మొదలయ్యే సరికే రాజధాని భూములన్నీ విదేశీ కంపెనీల చేతుల్లో, బ్యాంకుల తాకట్టులో ఉండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  15 Oct 2018 8:01 PM GMT
Next Story