Telugu Global
NEWS

కొత్త ఎత్తు.... కోదండరాంపై చేయిపెడుతున్న కాంగ్రెస్

తెలంగాణ మహాకూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావడం లేదు. టీడీపీ వరకు సీట్ల విషయంలో పెద్దగా పట్టింపులు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ ఎన్ని సీట్లు ఇచ్చినా పొత్తును మాత్రం కొనసాగించేందుకే టీడీపీ సిద్దంగా ఉంది. టీజేఎస్‌ విషయంలో మాత్రం కాంగ్రెస్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. 17 సీట్లు ఆశిస్తున్నకోదండరాం ఏదో ఒకటి త్వరగా తేల్చాలని డెడ్‌లైన్లు కూడా పెట్టారు. ఆ డెడ్‌లైన్లను కాంగ్రెస్‌ లెక్కలోకి తీసుకోకపోయినా… కోదండరాంను మాత్రం దూరం చేసుకునేందుకు సిద్ధంగా లేదు. అయితే […]

కొత్త ఎత్తు.... కోదండరాంపై చేయిపెడుతున్న కాంగ్రెస్
X

తెలంగాణ మహాకూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావడం లేదు. టీడీపీ వరకు సీట్ల విషయంలో పెద్దగా పట్టింపులు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ ఎన్ని సీట్లు ఇచ్చినా పొత్తును మాత్రం కొనసాగించేందుకే టీడీపీ సిద్దంగా ఉంది. టీజేఎస్‌ విషయంలో మాత్రం కాంగ్రెస్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. 17 సీట్లు ఆశిస్తున్నకోదండరాం ఏదో ఒకటి త్వరగా తేల్చాలని డెడ్‌లైన్లు కూడా పెట్టారు. ఆ డెడ్‌లైన్లను కాంగ్రెస్‌ లెక్కలోకి తీసుకోకపోయినా… కోదండరాంను మాత్రం దూరం చేసుకునేందుకు సిద్ధంగా లేదు. అయితే నేరుగా టీజేఎస్‌కు భారీగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుమఖంగా లేదు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. గోల్కొండ హోటల్‌లో సమావేశమైన టీ కాంగ్రెస్ కోర్‌ కమిటీ… టీజేఎస్‌కు ఎలాగో పార్టీ గుర్తు లేదు కాబట్టి కోదండరాం సూచించిన వ్యక్తులను కాంగ్రెస్ బీఫాం మీదే పోటీ చేయిస్తే బాగుంటుంది అని కాంగ్రెస్ కోర్‌ కమిటీ భావించింది. కోదండరాంను కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించింది. అధికారంలోకి వస్తే ఈ ప్రణాళిక చైర్మన్ పోస్టుకు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

కోదండరాం ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఆయన సూచించిన 10 నుంచి 12 మందికి టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సై అంటోంది. ఈ ప్రతిపాదనలపై కోదండరాంతో చర్చించే బాధ్యతలను జానారెడ్డికి అప్పగించారు. కోర్‌ కమిటీ భేటీ తర్వాత టీజేఎస్‌ నేతలు దిలీప్‌ కుమార్, రచనా రెడ్డిలు జానారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రతిపాదనలను వారి ముందుంచారు జానారెడ్డి.

కాంగ్రెస్‌ ప్రతిపాదనలు పరిశీలిస్తే టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే తీరులో ఉన్నాయి. కాంగ్రెస్ బీఫాంపై టీజేఎస్ వ్యక్తులకు టికెట్లు ఇచ్చినా వారు కాంగ్రెస్‌ సభ్యులే అవుతారు. ఒకవేళ వారు గెలిచినా కాంగ్రెస్‌ నిర్ణయాలను ధిక్కరించే పరిస్థితి ఉండదు. కోదండరాంకు డిప్యూటీ సీఎం స్థాయి హోదా ఇస్తామని ఆఫర్ చేయడం ద్వారా టీజేఎస్‌ను కాంగ్రెస్ మింగేసేలాగే ఉందని భావిస్తున్నారు. టీజేఎస్ ఉనికినే ప్రశ్నార్థం చేసేలా ఉన్న ఈ ప్రతిపాదనలకు కోదండరాం ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి.

First Published:  15 Oct 2018 7:19 AM GMT
Next Story