Telugu Global
NEWS

చంద్రబాబుపై తిరగబడ్డ తుపాను బాధితులు

తిత్లీ తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాళంలో జిల్లాలో పర్యటింంచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చుక్కెదురైంది. పలు చోట్ల బాధితులు చంద్రబాబును అడ్డుకుని ఘెరావ్ చేశారు. షో తప్ప సాయం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిటీ గ్రామస్తులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సు దిగకూండా , బాధితులతో మాట్లాడకుండా ముఖ్యమంత్రి నేరుగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించడంతో బాధితులు బస్సును అడ్డుకున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రోజులుగా కనీసం తినేందుకు తిండి కూడా లేకుండా […]

చంద్రబాబుపై తిరగబడ్డ తుపాను బాధితులు
X

తిత్లీ తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాళంలో జిల్లాలో పర్యటింంచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చుక్కెదురైంది. పలు చోట్ల బాధితులు చంద్రబాబును అడ్డుకుని ఘెరావ్ చేశారు. షో తప్ప సాయం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కవిటీ గ్రామస్తులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సు దిగకూండా , బాధితులతో మాట్లాడకుండా ముఖ్యమంత్రి నేరుగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించడంతో బాధితులు బస్సును అడ్డుకున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రోజులుగా కనీసం తినేందుకు తిండి కూడా లేకుండా తాము బతుకుతున్నామని…. ఒక్క నేత కూడా తమ వద్దకు రాలేదని వారు వాపోయారు.

ముఖ్యమంత్రి కూడా బస్సు దిగకుండా నేరుగా వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో కేవలం ప్రభుత్వం షో చేస్తోందని… సాయం మాత్రం చేయడం లేదని వాపోయారు. చంద్రబాబు బుల్లెట్ ఫ్రూప్ బస్సుకు అడ్డుపడ్డ బాధితులను పోలీసులు పక్కకు తోసేశారు. చంటిబిడ్డలను తీసుకుని వచ్చిన మహిళలు చంద్రబాబును ఘెరావ్ చేశారు. తనను నిలదీసిన గ్రామస్తులపై చంద్రబాబు ”హేయ్‌… ఆగు .. హేయ్ నేను చెప్పేది విను” అంటూ గద్దించారు. తుపాను సహాయక చర్యల్లో విఫలమైన అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పి చంద్రబాబు వెళ్లిపోయారు.

First Published:  13 Oct 2018 7:10 PM GMT
Next Story