Telugu Global
NEWS

గెలుపు కోసం చిన్న పార్టీల వైపు రెబల్స్ చూపు....

గడిచిన సారి కాంగ్రెస్, టీఆర్ఎస్ టికెట్లు ఆశించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు దక్కించుకోలేకపోయారు. దీంతో చేసేదేం లేక బీఎస్పీ తరఫున ఏనుగు గుర్తుపై నిర్మల్, కాగజ్ నగర్ లలో పోటీచేశారు. బలమైన నాయకులు కావడంతో వీరిద్దరూ బీఎస్పీ తరఫున గెలిచారు. తర్వాత ఇద్దరూ టీఆర్ఎస్ లో చేరారు. ఇందులో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఏకంగా రాష్ట్ర మంత్రి పదవి చేపట్టారు. కోనప్ప టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు […]

గెలుపు కోసం చిన్న పార్టీల వైపు రెబల్స్ చూపు....
X

గడిచిన సారి కాంగ్రెస్, టీఆర్ఎస్ టికెట్లు ఆశించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు దక్కించుకోలేకపోయారు. దీంతో చేసేదేం లేక బీఎస్పీ తరఫున ఏనుగు గుర్తుపై నిర్మల్, కాగజ్ నగర్ లలో పోటీచేశారు. బలమైన నాయకులు కావడంతో వీరిద్దరూ బీఎస్పీ తరఫున గెలిచారు. తర్వాత ఇద్దరూ టీఆర్ఎస్ లో చేరారు. ఇందులో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఏకంగా రాష్ట్ర మంత్రి పదవి చేపట్టారు. కోనప్ప టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మరో సారి అదే పునరావృతమవుతోంది.

తాజాగా 14 ఏళ్లుగా టీఆర్ఎస్ లో ఉండి కొట్లాడిన ఉద్యమకారుడు, ఎమ్మెల్యే అభ్యర్థి బేర సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల టికెట్ ఆశించి దక్కకపోవడంతో ఆయన బీఎస్పీలో చేరి మంచిర్యాల టికెట్ పొందారు. ఏరోజు తెలంగాణ కోసం పోరాడని ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావును ఓడించేందుకు రెడీ అయ్యారు. నిజానికి టీఆర్ఎస్ తో 14 ఏళ్లు ఉండి ప్రజల నోట్లో నాలుకలా ఉన్న బేర సత్య నారాయణ గెలవడం ఈజీ అని నియోజకవర్గంలో విశ్లేషణ సాగుతోంది. అందుకే దివాకర్ రావు ఎంత బుజ్జిగించినా ఈయన వినడం లేదట.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్రం చోటుచేసుకోబోతోంది. మహాకూటమిలో సీట్లు దక్కని నేతలంతా ఇప్పుడు చిన్న పార్టీల వైపు చూస్తున్నారు. బీజేపీ నుంచి పోటీచేస్తే ముస్లిం ఓట్లు పడవని.. కాంగ్రెస్, టీఆర్ఎస్ లో సాధ్యం కాదని.. ఇక టీడీపీ, టీజేఎస్ కంటే కూడా ఎవ్వరికీ అభ్యంతరం లేని బీఎస్పీ, బీఎల్ఎఫ్, ఆమ్ ఆద్మీ, ఆర్పీఐ వంటి చిన్న పార్టీల నుంచి బరిలోకి దిగుతున్నారు.

2014లో బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్‌ రెడ్డి మంత్రి అయ్యాడని… అందుకే ఆయన స్ఫూర్తిగా ఇప్పుడు బలమైన నేతలంతా చిన్న పార్టీలపై గెలిస్తే ఆ తర్వాత బీఫామ్ సమస్య లేకుండా వేరే పార్టీలోకి వెళ్లి ఉన్నత పదవులు ఆశించవచ్చని ఆశపడుతున్నారు. అదే పెద్ద పార్టీల నుంచి పోటీచేసి పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందని.. అదే చిన్న పార్టీలు పట్టించుకోవని ఇలా ప్లాన్ చేస్తున్నారు.

First Published:  13 Oct 2018 7:10 PM GMT
Next Story