Telugu Global
NEWS

హైదరాబాద్ టెస్టులో టీమిండియా కుర్రాళ్ల జోరు

పృథ్వీ షా, రిషభ్ పంత్ ల ధూమ్ ధామ్ బ్యాటింగ్ పృథ్వీ షా 53 బాల్స్ లో 11 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 70 పరుగులు రిషభ్ పంత్ 120 బాల్స్ లో 10 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 85 నాటౌట్ హైదరాబాద్ టెస్ట్ రెండోరోజుఆటలో…టీమిండియా యువఆటగాళ్లు పృథ్వీ షా, రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీలతో సత్తా చాటుకొన్నారు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సైతం..బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో.. జట్టుకు అండగా నిలిచాడు. టీమిండియా యంగ్ […]

హైదరాబాద్ టెస్టులో టీమిండియా కుర్రాళ్ల జోరు
X
  • పృథ్వీ షా, రిషభ్ పంత్ ల ధూమ్ ధామ్ బ్యాటింగ్
  • పృథ్వీ షా 53 బాల్స్ లో 11 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 70 పరుగులు
  • రిషభ్ పంత్ 120 బాల్స్ లో 10 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 85 నాటౌట్

హైదరాబాద్ టెస్ట్ రెండోరోజుఆటలో…టీమిండియా యువఆటగాళ్లు పృథ్వీ షా, రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీలతో సత్తా చాటుకొన్నారు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సైతం..బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో.. జట్టుకు అండగా నిలిచాడు.

టీమిండియా యంగ్ గన్స్ పృథ్యీ షా, రిషభ్ పంత్…బ్యాట్ ఝుళిపించారు. ఫటాఫట్ బ్యాటింగ్ తో…భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యానికి మార్గం సుగమం చేశారు.

వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సైతం తనవంతుగా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు అండగా నిలిచాడు.

రాహల్ ఫ్లాప్- పృథ్వీ షా హిట్….

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో …రెండోరోజు ఆట కొనసాగించిన విండీస్ …311 పరుగులకే ఆలౌట్ కావడంతో…. యువఓపెనర్లు రాహుల్- పృథ్వీ షాల జోడీతో… టీమిండియా తన బ్యాటింగ్ ప్రారంభించింది.

ఓపెనర్లు పృథ్వీషా- రాహుల్ మొదటి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. అయితే. రాహుల్ మాత్రం…25 బాల్స్ ఎదుర్కొన్నా…కేవలం 4 పరుగుల స్కోరుకే… విండీస్ కెప్టెన్ హోల్డర్ బౌలింగ్ లో దొరికిపోడంతో…టీమిండియా తొలివికెట్ కోల్పోయింది.

పృథ్వీ…అదే జోరు….

ఆ తర్వాత…మరో యువ ఓపెనర్ పృథ్వీ షా…బౌండ్రీల వర్షంతో కరీబియన్ బౌలర్లపై ఎదురుదాడి మొదలు పెట్టాడు. షా కేవలం 39 బాల్స్ లోనే 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

షా సెంచరీ ఖాయమనుకొంటున్న తరుణంలో 70 పరుగుల స్కోరుకు…స్పిన్నర్ వారికోన్ బౌలింగ్ లో దొరికిపోయాడు. ఆ తర్వాత…వన్ డౌన్ చతేశ్వర్ పూజారా సైతం…కేవలం 10 పరుగులు మాత్రమే చేసి….గేబ్రియల్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

కొహ్లీ 45 పరుగులకే అవుట్…

ఒకదశలో మూడు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన టీమిండియాను…కెప్టెన్ కొహ్లీ,వైస్ కెప్టెన్ రహానే ఆదుకోడానికి తమవంతుగా పోరాడారు. కొహ్లీ 45 పరుగుల స్కోరుకు …హోల్డర్ బౌలింగ్ లో అవుట్ కావడంతో టీమిండియా నాలుగో వికెట్ నష్టపోయింది.

కొహ్లీ స్థానంలో వచ్చిన రిషభ్ పంత్ తో కలసి…వైస్ కెప్టెన్ రహానే పోరాటం కొనసాగించాడు. ఐదో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో…పరిస్థితి చక్కదిద్దాడు.

సెంచరీలకు చేరువగా….

ఈ క్రమంలో రహానే 122 బాల్స్ లో 4 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా….రిషభ్ పంత్ 67 బాల్స్ లో 9 బౌండ్రీలతో అర్థశతకం బాదడంతో… టీమిండియా కష్టాల నుంచి గట్టెక్కగలిగింది. విండీస్ బౌలర్లలో…హోల్డర్ 2 వికెట్లు, గేబ్రియల్, వారికోన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆట ముగిసే సమయానికి వైస్ కెప్టెన్ రహానే 75, యువవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ 85 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో ఉన్నారు.

First Published:  13 Oct 2018 10:40 PM GMT
Next Story