Telugu Global
NEWS

బాబు పంచాయితీ.... నగరిలో కొత్త లొల్లి!

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన పంచాయితీ పెద్దగా ఫలితాన్ని ఇచ్చినట్టుగా లేదు. అక్కడ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నాయుడు చాలా పంచాయితీ చేశాడు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణించడంతో అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వచ్చింది చంద్రబాబు. గాలికి ఇద్దరు కొడుకులున్నారు. వారిద్దరూ తండ్రి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ వారసత్వం విషయంలోనే పోరాడారు. దీంతో బాబు చేసేది లేక గాలి సతీమణిని ఎమ్మెల్సీగా ప్రకటించాడు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో మాత్రం […]

బాబు పంచాయితీ.... నగరిలో కొత్త లొల్లి!
X

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన పంచాయితీ పెద్దగా ఫలితాన్ని ఇచ్చినట్టుగా లేదు. అక్కడ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నాయుడు చాలా పంచాయితీ చేశాడు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణించడంతో అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వచ్చింది చంద్రబాబు. గాలికి ఇద్దరు కొడుకులున్నారు. వారిద్దరూ తండ్రి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ వారసత్వం విషయంలోనే పోరాడారు. దీంతో బాబు చేసేది లేక గాలి సతీమణిని ఎమ్మెల్సీగా ప్రకటించాడు.

ఇక ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో మాత్రం చంద్రబాబుకు గాలి ఫ్యామిలీ నుంచే తలనొప్పి మొదలైంది. టికెట్ తనకంటే తనకు అని గాలి తనయులిద్దరూ పోటీలు పడ్డారు. ఈ నేపథ్యంలో బాబు గాలి కుటుంబీకులను పిలిచి.. మీలో మీరు తేల్చుకుని చెప్పండని చెప్పాడు. ఆ మేరకు వారు రాజీకి వచ్చారు. గాలి తనయుడు భాను ప్రకాష్ కు బాబు టికెట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతోనే అక్కడ కొత్త లొల్లి మొదలైంది.

మళ్లీ టికెట్ ను గాలి కుటుంబానికే ఖరారు చేయడం పట్ల స్థానిక టీడీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యర్థిత్వం మీద ఆశలు పెట్టుకున్న వాళ్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. అటు క్షత్రియ సామాజికవర్గం ఈ సీటును తమకు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి క్షత్రియ సామాజికవర్గం వారు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారి నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

ఇక కమ్మ వాళ్లలోనే మరో వర్గం కూడా ఉంది. వాళ్లూ టికెట్ అడుగుతున్నారు. మరికొంతమంది ఆశావహులు కూడా టికెట్ ప్లీజ్ అంటున్నారు. గాలి కుటుంబానికి టికెట్ ను ఖరారు చేయడం పట్ల ఇలా తెలుగుదేశం పార్టీలోనే అసహనం పుడుతోంది. దీన్ని బాబు ఎలా చల్లారుస్తాడో.

First Published:  13 Oct 2018 7:06 PM GMT
Next Story