Telugu Global
NEWS

రూం నెంబర్‌ 122లో నక్కిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యిందన్న విమర్శలు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఏపీలో జరగకూడని పరిణామాలు చాలా జరుగుతున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు, ఏపీ పోలీసులు అవేవి పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఎన్నికల వేళ టీడీపీ కోసం ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లో భారీగా మోహరించారు. నెల రోజుల క్రితమే ఏపీ ఇంటెలిజెన్స్ మకాం గురించి విషయం బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులపై తెలంగాణ […]

రూం నెంబర్‌ 122లో నక్కిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు
X

ఆంధ్రప్రదేశ్‌లో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యిందన్న విమర్శలు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఏపీలో జరగకూడని పరిణామాలు చాలా జరుగుతున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు, ఏపీ పోలీసులు అవేవి పట్టించుకోవడం లేదు.

తెలంగాణ ఎన్నికల వేళ టీడీపీ కోసం ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లో భారీగా మోహరించారు. నెల రోజుల క్రితమే ఏపీ ఇంటెలిజెన్స్ మకాం గురించి విషయం బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులపై తెలంగాణ పోలీసులు నిఘా వేశారు. వారిని వీరు, వీరిని వారు నిరంతరం నిఘా నేత్రంతో వెంటాడుతున్నారు. లక్డీకపూల్‌ లో ఉన్న ఒక ప్రముఖ హోటల్‌లోని రూం నెంబర్ 122 కేంద్రంగా ఏపీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నడుస్తున్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఈ హోటల్‌కు సమీపంలోనే తెలంగాణ ఇంటెలిజెన్స్ కార్యాలయం ఉండడం విశేషం. తెలంగాణ ఇంటెలిజెన్స్ కార్యాలయంలోకి వచ్చే వాహనాలు, వ్యక్తులపై ఈ హోటల్‌లోని రూం నంబర్ 122 నుంచి ఏపీ నిఘా అధికారులు కన్నేశారని తెలంగాణ పోలీసులు గుర్తించారు.

తాం ఎక్కడికి వెళుతున్నాం…. ఏం చేస్తున్నామన్నది ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు గమనిస్తూ ఎప్పటికప్పుడు ఏపీ ముఖ్యమంత్రికి సమాచారం చేరవేస్తున్నట్టు తమ వద్ద పక్కా సమాచారం ఉందని తెలంగాణ పోలీసులు వెల్లడించినట్టు ఒక ప్రముఖ పత్రిక వెల్లడించింది. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి రాజకీయ కోణంలో నిఘా ఉంచడం చట్ట విరుద్దమని…. ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

తాము కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌ వచ్చి ఏంచేస్తున్నది నిఘా ఉంచామంటున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు దాదాపు వంద మంది ఈ హోటల్‌లో మకాం వేశారు. వీరు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించారు.

కాంగ్రెస్‌తో పొత్తు ఖాయం అయిన తర్వాత టీడీపీ అభ్యర్థులకు డబ్బు సరఫరాను ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులే పర్యవేక్షించే అవకాశం ఉందన్న సమాచారం ఉందని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

First Published:  13 Oct 2018 7:32 PM GMT
Next Story