Telugu Global
Cinema & Entertainment

"అరవింద సమేత" లో క్లైమాక్స్ సీన్ పై స్పందించిన త్రివిక్రమ్

మొత్తానికి “అరవింద సమేత” సినిమాతో మళ్ళి తన మాటల పవర్ ఏంటో చూపించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. అయితే ఈ సినిమా ఆరంభంలోనే ఒక భారీ ఫైట్ సీన్ పెట్టి ప్రేక్షకులని ఆశ్చర్య పరిచాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక సినిమా మొదట్లోనే ఫైట్ ఇలా ఉంటే ఇక క్లైమాక్స్ లో ఫైట్ అడిరిపోతుందని అంతా ఆశించారు. కానీ “అరవింద సమేత” క్లైమాక్స్ లో ఫైట్ […]

అరవింద సమేత లో క్లైమాక్స్ సీన్ పై స్పందించిన త్రివిక్రమ్
X

మొత్తానికి “అరవింద సమేత” సినిమాతో మళ్ళి తన మాటల పవర్ ఏంటో చూపించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. అయితే ఈ సినిమా ఆరంభంలోనే ఒక భారీ ఫైట్ సీన్ పెట్టి ప్రేక్షకులని ఆశ్చర్య పరిచాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఇక సినిమా మొదట్లోనే ఫైట్ ఇలా ఉంటే ఇక క్లైమాక్స్ లో ఫైట్ అడిరిపోతుందని అంతా ఆశించారు. కానీ “అరవింద సమేత” క్లైమాక్స్ లో ఫైట్ లేదు. అయినా ప్రేక్షకులు ఎక్కడా నిరాశపడలేదు. దీనికి కారణం త్రివిక్రమ్ తన మాటల్లోనే చెప్పారు.

“వాస్తవంగా చెప్పాలంటే మేము ముందు ఓ యాక్షన్ క్లైమాక్స్ అనుకున్నాం. దాన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అంతా కూర్చొని డిస్కషన్స్ చేసినప్పుడు, క్లైమాక్స్ లో యుద్ధం వద్దు అని చెప్పింది ఫైట్ మాస్టర్సే. చివర్లో ఫైట్ కంటే కూడా డైలాగులతో వెళ్ళడమే దీనికి కరెక్ట్ గా ఉంటుందని అన్నారు. అది మా టీం అందరికి నచ్చింది. అందుకే సినిమా క్లైమాక్స్ ని అలా పూర్తీ చేసాం, ఇప్పుడు ప్రేక్షకులకి కూడా అది బాగా నచ్చుతుంది” అని చెప్పాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

First Published:  12 Oct 2018 11:27 PM GMT
Next Story