Telugu Global
Cinema & Entertainment

అరవిందపై రాజమౌళి కామెంట్లు

బడా సినిమాలపై రెస్పాండ్ అవ్వడం రాజమౌళికి అలవాటు. ఒకవేళ సినిమా చిన్నదైనా బాగుంటే, మెచ్చుకంటూ ట్వీట్ చేస్తుంటాడు. అలాంటిది అరవింద సమేతపై రాజమౌళి ఇప్పటివరకు ఎందుకు ట్వీట్ చేయలేదా అని చాలామంది అనుమానం వ్యక్తంచేశారు. కానీ ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అరవింద సమేతపై జక్కన్న ట్వీటాడు. సినిమా బాగుందంటూ మెచ్చుకున్నాడు. అందరికంటే కాస్త ఆలస్యంగా అరవింద సమేత చూసిన రాజమౌళి, ట్విట్టర్ లో స్పందించాడు. యుద్ధం తర్వాత ఏం జరుగుతుందనే కాన్సెప్టుతో తీసిన అరవింద సమేత […]

అరవిందపై రాజమౌళి కామెంట్లు
X

బడా సినిమాలపై రెస్పాండ్ అవ్వడం రాజమౌళికి అలవాటు. ఒకవేళ సినిమా చిన్నదైనా బాగుంటే, మెచ్చుకంటూ ట్వీట్ చేస్తుంటాడు. అలాంటిది అరవింద సమేతపై రాజమౌళి ఇప్పటివరకు ఎందుకు ట్వీట్ చేయలేదా అని చాలామంది అనుమానం వ్యక్తంచేశారు. కానీ ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అరవింద సమేతపై జక్కన్న ట్వీటాడు. సినిమా బాగుందంటూ మెచ్చుకున్నాడు.

అందరికంటే కాస్త ఆలస్యంగా అరవింద సమేత చూసిన రాజమౌళి, ట్విట్టర్ లో స్పందించాడు. యుద్ధం తర్వాత ఏం జరుగుతుందనే కాన్సెప్టుతో తీసిన అరవింద సమేత చాలా బాగుందని మెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చాన్నాళ్లు గుర్తుండిపోతుందన్న రాజమౌళి, త్రివిక్రమ్ టేకింగ్ తోపాటు యూనిట్ మొత్తాన్ని అభినందించాడు.

రాజమౌళితో పాటు ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు అరవింద సమేతపై స్పందించాడు. సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్తాడు.

First Published:  13 Oct 2018 6:41 AM GMT
Next Story