Telugu Global
NEWS

వైసీపీ అంటే చంపేయడమే!.... నేతల ఏరివేత....

రాయలసీమలో ఫ్యాక్షన్‌ దాదాపు కనుమరుగు అయినా మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో మాత్రం తరుచూ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీకి చేందిన మండల, గ్రామ స్థాయి నాయకుల హత్యలు వరుసగా జరుగుతున్నాయి. బుధవారం ఆత్మకూరు మండల సీనియర్ నాయకుడు కేశవరెడ్డిని దారుణంగా హత్య చేశారు. మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీ కనుసన్నల్లోనే ఈ హత్య జరిగిందని మృతుడి భార్యే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో బాలాజీ […]

వైసీపీ అంటే చంపేయడమే!.... నేతల ఏరివేత....
X

రాయలసీమలో ఫ్యాక్షన్‌ దాదాపు కనుమరుగు అయినా మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో మాత్రం తరుచూ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీకి చేందిన మండల, గ్రామ స్థాయి నాయకుల హత్యలు వరుసగా జరుగుతున్నాయి.

బుధవారం ఆత్మకూరు మండల సీనియర్ నాయకుడు కేశవరెడ్డిని దారుణంగా హత్య చేశారు. మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీ కనుసన్నల్లోనే ఈ హత్య జరిగిందని మృతుడి భార్యే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో బాలాజీ పేరు చేర్చేందుకు అంగీకరించలేదు. ఇంతలోనే సాయంత్రానికి హత్య చేసిన వ్యక్తులు ఆఘమేఘాల మీద లొంగిపోయారు.

లొంగిపోయిన నిందితులు చెప్పిన దాని ప్రకారం హత్య వెనుక బాలాజీ ప్రమేయం లేదని అందుకే అతడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని పోలీసులు తేల్చేశారు. ఈ పరిణామం పై రాప్తాడు వైసీపీ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసులు మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లో పనిచేస్తున్నారని… అందుకే స్వయంగా హతుడి భార్య ఫిర్యాదు చేసినా సరే ఎఫ్‌ఐఆర్‌లో మంత్రి సోదరుడి పేరును చేర్చలేదని విమర్శించారు. బాలాజీ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పరిటాల కుటుంబం ఆదేశాల మేరకు నిందితులు వెంటనే లొంగిపోయారని చెప్పారు.

నియోజకవర్గంలో బలహీనపడుతున్నామన్న భయంతో వైసీపీ నేతలను హత్యలు చేయించడం ద్వారా పట్టు సాధించేందుకు పరిటాల సునీత కుటుంబం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేశవరెడ్డి మృతదేహానికి తొలుత పోస్టుమార్టం చేయకుండా పోలీసులే అడ్డుకున్నారంటే అందులో మంత్రి ప్రమేయం లేదా అని ప్రశ్నించారు.

చివరకు బంధువులు ఆందోళనకు దిగితే అప్పుడు పోస్టుమార్టంకు అనుమతి ఇచ్చారని ప్రకాశ్ రెడ్డి చెప్పారు. కందుకూరు శివారెడ్డి, రాప్తాడు భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి, తగరకుంట కొండారెడ్డిలను హత్యలు చేయించింది పరిటాల కుటుంబమేనని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

ఇప్పుడు ఆత్మకూరు మండలంలో కేశవరెడ్డి వైసీపీ తరపున బలమైన నేతగా ఎదుగుతుండడంతో హత్య చేయించారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపించే కొద్ది వైసీపీ నేతలను పరిటాల కుటుంబం హత్యలు చేయిస్తోందని ఆరోపించారు.

First Published:  11 Oct 2018 10:05 PM GMT
Next Story