Telugu Global
Cinema & Entertainment

"లక్ష్మిస్ ఎన్టీఆర్" తో వస్తానంటున్న వర్మ

రామ్ గోపాల్ వర్మ మొన్నటి వరకు వివాదాలకి దూరంగా ఉన్నాడు. కానీ సైలెంట్ గా ఉన్నాడు అని అనుకునే లోపే ఒక పెద్ద ప్రకటన చేసాడు రామ్ గోపాల్ వర్మ. నిజానికి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నానని విషయం బయట పెట్టిన వెంటనే రామ్ గోపాల్ వర్మ తాను కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని, అది ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఉంటుందని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే పోస్టర్ కూడా రిలీజ్ […]

లక్ష్మిస్ ఎన్టీఆర్ తో వస్తానంటున్న వర్మ
X

రామ్ గోపాల్ వర్మ మొన్నటి వరకు వివాదాలకి దూరంగా ఉన్నాడు. కానీ సైలెంట్ గా ఉన్నాడు అని అనుకునే లోపే ఒక పెద్ద ప్రకటన చేసాడు రామ్ గోపాల్ వర్మ. నిజానికి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నానని విషయం బయట పెట్టిన వెంటనే రామ్ గోపాల్ వర్మ తాను కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని, అది ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఉంటుందని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

ఈ సినిమాకి “లక్ష్మిస్ ఎన్టీఆర్” అని టైటిల్ కూడా పెట్టాడు. అయితే ఇప్పుడు బాలకృష్ణ నటించిన “ఎన్టీఆర్” బయోపిక్ షూటింగ్ దాదాపు పూర్తి పూర్తయిపోగా ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సెట్స్ పైకి తీసుకు వెళతానని వర్మ చెబుతున్నాడు. అక్టోబర్ 19న తిరుపతిలో జరిగే ప్రెస్ మీట్ లో మరిన్ని వివరాలను వెల్లడిస్తాడట. దసరా నుంచి షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది జనవరి చివరి వారం లో ఈ సినిమాని ధియేటర్స్ లోకి తీసుకొని వస్తారట. అయితే ఈ రామ్ గోపాల్ వర్మ తీసే బయోపిక్ ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి’ల జీవితం గురించి చూపిస్తారట.

First Published:  12 Oct 2018 10:50 AM GMT
Next Story