Telugu Global
NEWS

కాంగ్రెస్ టికెట్ కోసం అల్లుడు శీను ప్ర‌య‌త్నాలు !

తెలంగాణ టికెట్ల వేట చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే స‌రికి ఏదో ఒక పార్టీ టికెట్ సంపాదించాల‌నే ఆలోచ‌న‌లో నేత‌లు ఉన్నారు. టీఆర్ఎస్‌లో 14 టికెట్ల గొడ‌వ మిగిలి ఉంది. ఇక్క‌డే ఇద్ద‌రు నేత‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ఈ టికెట్ల వ్య‌వ‌హారం తేల్చ‌బోతోంది. అందులో ఒక‌రు హోం మంత్రి నాయిని న‌ర్సింహ్మ‌రెడ్డి. మ‌రొక‌రు ఖైర‌తాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌. నాయిని త‌న అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి కోసం ముషీరాబాద్ టికెట్ అడుగుతున్నారు. ఇందుకోసం లాబీయింగ్ […]

కాంగ్రెస్ టికెట్ కోసం అల్లుడు శీను ప్ర‌య‌త్నాలు !
X

తెలంగాణ టికెట్ల వేట చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే స‌రికి ఏదో ఒక పార్టీ టికెట్ సంపాదించాల‌నే ఆలోచ‌న‌లో నేత‌లు ఉన్నారు. టీఆర్ఎస్‌లో 14 టికెట్ల గొడ‌వ మిగిలి ఉంది. ఇక్క‌డే ఇద్ద‌రు నేత‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ఈ టికెట్ల వ్య‌వ‌హారం తేల్చ‌బోతోంది. అందులో ఒక‌రు హోం మంత్రి నాయిని న‌ర్సింహ్మ‌రెడ్డి. మ‌రొక‌రు ఖైర‌తాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌.

నాయిని త‌న అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి కోసం ముషీరాబాద్ టికెట్ అడుగుతున్నారు. ఇందుకోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే కేటీఆర్‌ను రెండు సార్లు క‌లిశారు. టికెట్ ఇవ్వాల‌ని కోరారు. త‌న‌కు లేక‌పోతే త‌న అల్లుడికి టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న ప్ర‌తిపాద‌న పెట్టారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ముఠా గోపాల్‌కు మ‌రోసారి టికెట్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో నాయిని టీఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కేసీఆర్‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అయితే ఇంత‌వ‌ర‌కూ కేసీఆర్ మాత్రం క‌ల‌వ‌లేదు. దీంతో టికెట్ ఆశ‌లు రోజురోజుకు స‌న్న‌గిల్లుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల కింద‌ట ఢిల్లీ వెళ్లి ఆయ‌న అనుచ‌రులు కాంగ్రెస్‌లో కీల‌క‌నేత‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు చేశార‌ని తెలిసింది. ఒక వేళ టీఆర్ఎస్ టికెట్ రాకుంటే కాంగ్రెస్‌లో చేరి….ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేయాల‌నేది శ్రీనివాస్‌రెడ్డి ప్లాన్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ముఠాగోపాల్ ముషీరాబాద్‌లో ప్ర‌చారం ప్రారంభించ‌డంతో…టికెట్ త‌మ‌కు రాదేమో అనే డౌట్ నాయిని గ్రూపులో ఉంది. దీంతో వారు ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే నాయిని మాత్రం కాంగ్రెస్ నేత‌ల‌ను తాము క‌ల‌వ‌లేద‌ని అంటున్నారు.

ఇటు దానం ప‌రిస్థితి కూడా సేమ్ టు సేమ్‌. ఖైర‌తాబాద్ టికెట్ ఇంకా ఖ‌రారు కాలేదు. ఒకవేళ గోషామ‌హాల్‌కు వెళ్లమ‌ని ఫోర్స్ చేస్తే ఎలా అని దానం మ‌థ‌న‌ప‌డుతున్నారు. ఖైర‌తాబాద్ టికెట్ ఇవ్వ‌క‌పోతే దానం కూడా యూట‌ర్న్ తీసుకునే అవకాశాలు ఎక్కువ‌ని ప్ర‌చారం న‌డుస్తోంది.

First Published:  11 Oct 2018 11:10 PM GMT
Next Story