Telugu Global
NEWS

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..... రాహుల్ వద్దకు గద్దర్..... కేసీఆర్ పై పోటీ

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు బలమైన కాంగ్రెస్ నేతలను ఓడించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే.. ఇప్పుడు కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ పెద్ద ఎత్తు వేసింది. ఉత్తమ్ సహా జానా, కోమటిరెడ్డిలపై ధీటైన అభ్యర్థులను నిలిపి ఓడించేందుకు కేసీఆర్ స్కెచ్ గీశారు. అదే సమయంలో తాజాగా కాంగ్రెస్ కూడా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో షాకిచ్చేందుకు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ, […]

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..... రాహుల్ వద్దకు గద్దర్..... కేసీఆర్ పై పోటీ
X

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు బలమైన కాంగ్రెస్ నేతలను ఓడించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే.. ఇప్పుడు కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ పెద్ద ఎత్తు వేసింది.

ఉత్తమ్ సహా జానా, కోమటిరెడ్డిలపై ధీటైన అభ్యర్థులను నిలిపి ఓడించేందుకు కేసీఆర్ స్కెచ్ గీశారు. అదే సమయంలో తాజాగా కాంగ్రెస్ కూడా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో షాకిచ్చేందుకు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ శుక్రవారం ఉదయం అనూహ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ ను తీసుకొని ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీని కలవనున్నట్లు సమాచారం. గద్దర్ కు కాంగ్రెస్ కండువా వేయించి కాంగ్రెస్ తరఫున ఈ ఎన్నికల బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గద్దర్ స్వగ్రామం మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం తుఫ్రాన్. ప్రస్తుతం గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా పోటీ చేయబోతున్నారు. కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ స్కెచ్ గీసింది. ఇందులో భాగంగా ఉద్యమకారుడు గద్దర్ ను బరిలోకి దింపుతోంది. మధుయాష్కీ ఈ బాధ్యతను భుజాన వేసుకొని ఢిల్లీ తీసుకెళ్లి గద్దర్ ను పార్టీలో చేర్పిస్తున్నారు. గజ్వేల్ లో కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా గద్దర్ కే ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈరకంగానైనా కేసీఆర్ ను కాస్త ఢిఫెన్స్ లో పడేయాలని చూస్తోంది.

గద్దర్‌ను అయితే కేసీఆర్ సహా మిగతా టీఆర్ఎస్ నేతలు తిట్టరని…. ఆయన్ను ఎదుర్కోవడం గులాబీ పార్టీకి కష్టమని భావిస్తున్నారు.
అయితే కేసీఆర్ మాత్రం గజ్వేల్ లో తన గెలుపు బాధ్యతను హరీష్ రావుపై పెట్టినట్లు సమాచారం. హరీష్ అన్నీ తానై అక్కడ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గద్దర్ పోటీచేస్తే పోరు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి.

First Published:  12 Oct 2018 12:39 AM GMT
Next Story