Telugu Global
NEWS

మూడు రోజుల క్రితం ఐటీ అధికారులకు నోటీసు ఇచ్చిన సీఎం రమేష్‌.... ఈ రోజు ఆయనపైనే దాడి

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, పారిశ్రామికవేత్త, ఎంపీ సీఎం రమేష్‌పై పక్కా ప్రణాళికతో ఐటీ దాడులు జరుగుతున్నాయి. సీఎం రమేష్‌కు సంబంధించిన వేల కోట్ల ఆస్తుల చిట్టా, భూములు, సంస్థలు, భవంతులు అన్నీ ఎక్కడ ఉన్నాయన్నది పరిశోధన చేసి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే ఐటీ దాడులకు దిగింది. 25 చోట్ల ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడ కేంద్రంగా ఐటీ దాడులకు సిద్ధమవగానే వెంటనే టీడీపీ పెద్దలకు సమాచారం చేరిపోయింది. అయితే సీఎం రమేష్‌పై దాడులు జరిగే […]

మూడు రోజుల క్రితం ఐటీ అధికారులకు నోటీసు ఇచ్చిన సీఎం రమేష్‌.... ఈ రోజు ఆయనపైనే దాడి
X

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, పారిశ్రామికవేత్త, ఎంపీ సీఎం రమేష్‌పై పక్కా ప్రణాళికతో ఐటీ దాడులు జరుగుతున్నాయి. సీఎం రమేష్‌కు సంబంధించిన వేల కోట్ల ఆస్తుల చిట్టా, భూములు, సంస్థలు, భవంతులు అన్నీ ఎక్కడ ఉన్నాయన్నది పరిశోధన చేసి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే ఐటీ దాడులకు దిగింది. 25 చోట్ల ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి.

ఇటీవల విజయవాడ కేంద్రంగా ఐటీ దాడులకు సిద్ధమవగానే వెంటనే టీడీపీ పెద్దలకు సమాచారం చేరిపోయింది. అయితే సీఎం రమేష్‌పై దాడులు జరిగే వరకు సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. దాదాపు వంద మంది ఈ దాడుల్లో పాల్గొంటున్నారని సమాచారం. వారిలో 15 మంది కమిషనర్‌ స్థాయి అధికారులే ఉన్నట్టు తెలుస్తోంది.

ఏపీలో వేల కోట్ల కాంట్రాక్టులు చేపడుతున్నా ఆ స్థాయిలో టాక్స్ చెల్లించకపోవడం, ఐటీ రిటర్న్‌కు, వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టు ఐటీ నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిపై దాడుల సమయంలో ఓటుకు నోటు కుంభకోణంలో 50లక్షలు కూడా సీఎం రమేష్ ద్వారానే వచ్చినట్టు ఐటీ ఒక అంచనాకు వచ్చింది.

ఈ నేపథ్యంలో సీఎం రమేష్ వేల కోట్ల సామ్రాజ్యానికి డబ్బు ప్రవాహం ఎక్కడి నుంచి వస్తోందో తేల్చేందుకే భారీగా ఐటీ బృందాలు దాడులకు దిగినట్టు చెబుతున్నారు. మూడు రోజుల క్రితమే పీఏసీ కమిటీ సభ్యుడి హోదాలో ఐటీ శాఖకు సీఎం రమేష్ నోటీసులు కూడా పంపించారు. దేశంలో వరుసగా ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారు.. ఎవరిపై చేస్తున్నారు వంటి వివరాలు అందజేయాలని నోటీసులు ఇచ్చారు సీఎం రమేష్. ఇంతలోనే తిరిగి ఐటీ దాడులు సీఎం రమేష్‌పైనే జరగడం ఆసక్తిగా ఉంది.

First Published:  11 Oct 2018 11:11 PM GMT
Next Story